ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని సైమల్టేనియస్‌గా చెప్పడమనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సినిమాయే ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ చెప్పడం వేరు.. సగటు ప్రేక్షకులంతా చెప్పడం వేరు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం కొనసాగింది. ఇక్కడే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ భారీగా టికెట్లు తెగాయి. ఈ మధ్యకాలంలో ఏ చిత్రానికి ఇంతలా టికెట్స్ తెగింది లేదు. ఈ చిత్రం రేపు (మే 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నాని మీడియాతో సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
’‘హిట్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా దేశమంతా తిరిగాం. రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ వైలెన్స్ అనేది కథ డిమాండ్‌ని బట్టి వచ్చింది. ఇది రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా రిలేటబుల్, స్టైలిష్‌గా ఉంటుంది. ఈ సినిమాని వైలెన్స్ కోసం తీయలేదు.. ఇదొక డిఫరెంట్ జానర్ సినిమా. కథలో ఆర్గానిక్‌గా వైలెన్స్ ఉందనే విషయం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రతి సినిమాను కొత్త జానర్‌లో చూస్తా. కాబట్టి ఈ సినిమా చేశా. స్క్రీన్‌పై వైలెన్స్ అనేది డిస్ట్రబ్ చేసేలా కాకుండా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మిక్కి జే మేయర్ ఇప్పటి వరకూ ఫీల్ గుడ్ మూవీసే చేశారు తప్ప థ్రిల్లర్ ఎప్పుడూ చేయలేదు. ఆయన థ్రిల్లర్ చేస్తే ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని తీసుకున్నాం. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ను ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
సినిమా షూటింగ్ పహల్గమ్‌లోని పలు లోకేషన్స్‌లో 18 రోజులు చేశాం. మొన్న జరిగిన ఘటన మమ్మల్ని కలిసివేసింది. సినిమాలో శ్రీనిధి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఇది తన సినిమా అన్నట్టుగా సపోర్ట్ చేయడమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా పాల్గొంది.సబ్జెక్ట్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నేనే చేయాల్సి వచ్చింది. ఈ సినిమా నేను చేయడానికి కారణం ఏంటనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నా మూడు సినిమాలకు రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. నా నెక్ట్స్ సినిమాకు ఆయన చీఫ్ గెస్ట్‌గా ఒకవేళ రాకపోతే ఎలా అనే టెన్షన్ మొదలైంది. ఈ సినిమాలో ఒక మంచి ప్రామిస్ రిలేటెడ్ ఎమోషనల్ హై ఉంది. ‘హిట్’లో వచ్చిన గత రెండు సినిమాలకు, ఈ సినిమాకు స్పష్టమైన తేడా ఉంది. శైలేష్ యాక్షన్ మూవీస్ తీయడంలో దిట్ట కానీ అతనిలో చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. కాబట్టి తనకు ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెబుతుంటా’’ అని నాని పేర్కొన్నాడు. అయితే చిరంజీవి అబిమాని అయిన తను ఆయనతో సినిమాను నిర్మించడం డైజెస్ట్ కావడం లేదంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా నాని తెలిపాడు.