Hero Surya: స్టైలిష్ ‘రౌడీ’ వేర్‌తో సూర్య.. ఇంతకీ దేనిని ప్రమోట్ చేస్తున్నట్టు?

కొన్ని సినిమా ప్రమోషన్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి ఇంట్రస్టింగ్ ప్రచార కార్యక్రమమే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అది చూసిన వారంతా అసలు ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల ‘రెట్రో’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. మొత్తానికి ఈవెంట్ పూర్తైంది. ఇక ఆ తరవాత సూర్య మూవీ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో సూర్య వేసుకున్న డ్రెస్ ఆకట్టుకుంటోంది.

హీరో విజయ్ దేవరకొండ ప్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హీరో సూర్య రౌడీ వేర్ పోలో టీ షర్ట్స్ ధరించి స్టైలిష్ లుక్స్‌తో ‘రెట్రో’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు సూర్య తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడా? లేదంటే రౌడీ వేర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సినిమాకు ఒకరకంగా భారీ ప్రమోషనే జరుగుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో మూవీ మే 1న థియేటర్స్‌లోకి రాబోతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *