మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో సినిమాను మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే. ‘దేవర’ సినిమా విడుదల అవగానే ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. ఏప్రిల్ 22న ఎన్టీఆర్ సెట్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగుళూరుకి దగ్గరలో జరుగుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు.
ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుందని టాక్. అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకూ లేదు. అలాగే ఇతర నటీనటుల గురించి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయనుందట. ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘సలార్’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ఎన్టీఆర్ – నీల్ కాంబోలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుందట. ఇక ఈ వార్తలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.