...

Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

Famous Telugu Producers :  ‘బాహుబలి’ సినిమా తర్వాత ఇండియన్‌ సినిమా స్వరూపమే మారిపోయింది.

రీసెంట్‌గా భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో ఉంటే ఆ భాషలో సినిమాను చూసేస్తున్నారు సినిమా లవర్స్అందరూ.

అందుకే పెద్ద పెద్ద బ్యానర్స్‌ కూడా అనేక భాషల్లో సినిమాలు తీయటానికి ముందుకు వస్తున్నాయి.

గతంలో అయితే తమిళ నిర్మాతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉండి తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు నిర్మించేవారు.

ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు నిర్మాతలు చాపకిందనీరులా అన్ని భాషల్లో సినిమాలు తీయటానికి సమాయత్తం అవుతున్నారు.

‘దిల్‌’ రాజు…

తెలుగులో ప్రముఖ నిర్మాతగా పేరుగాంచిన నిర్మాత ‘దిల్‌’ రాజు రెండేళ్ల క్రితమే తమిళంలోను భారీ ఎంట్రీ ఇచ్చారు.

2022 సంక్రాంతి సినిమాల్లో విజయ్‌ హీరోగా నటించిన ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’తో వచ్చి భారీ హిట్‌ను అందుకున్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు.

ఆ తర్వాత కూడా తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ‘గేమ్‌చేంజర్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు తమిళం అనే తేడా లేకుండా మంచి కథ దొరికితే ఏ భాషలో అయినా సినిమా తీసేందుకు రెడీ అని ‘దిల్‌’ రాజు అనేక సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

భారీనా చిన్న సినిమానా అనే తేడా లేకుండా మంచి కథ దొరికిన ప్రతిసారి తన క్రియేటివ్‌ ఇంటెలెక్చువల్‌ బ్రెయిన్‌తో భాషతో సంబంధం లేకుండా హిట్‌వైపు మాత్రమే చూస్తున్నాడు రాజు.

తమిళంలో ఎంతోమందితో మంచి సంబంధాలున్న రాజు ‘గేమ్‌చేంజర్‌’ సినిమా విడుదల తర్వాత తన గేమ్‌ను ఏ హీరో వైపుకు ఎటువైపుకు గురి పెడతాడో చూడాలి.

నిర్మాత యం. రాజశేఖర్‌ రెడ్డి….

ఈ పేరుతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్‌ అవ్వలేరు. కారణం ఏంటంటే షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై ఈ నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి అనేక తెలుగు, తమిళ సినిమాలు నిర్మించిన పబ్లిసిటీకి దూరంగా ఉండటంతో ప్రేక్షకులకు తెలిసే అవకాశం లేదు.

కానీ ఈయన నిర్మాణంలో వచ్చిన ‘కలర్స్‌’ స్వాతి, నవీన్‌చంద్ర మెయిన్‌లీడ్‌లో నటించిన ‘త్రిపుర’ చిత్రంతో పాటు ఆది పినిశెట్టి హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్‌’ సినిమా నిర్మించారు.

తమిళంలో ఏ.యల్‌ విజయ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శైవం’ గొప్ప పేరును సంపాదించుకుని తెలుగులో కూడా ‘దాగుడు మూతల దండాకోర్‌’ పేరుతో రీమేక్‌ చేసుకుంది.

తమిళంలో C/o కాదల్ అనే సినిమాను రీమేక్ చేసారు.

రకుల్‌ప్రీత్, విశ్వక్‌సేన్, నివేధా పేతురాజ్, మంజిమా మోహన్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన ఓటిటి సినిమా ‘భూ’ చిత్రానికి ఇతనే నిర్మాత.

ఫైనల్‌గా 2024 సంక్రాంతికి తమిళంలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. నలుగురు హీరోలు పోటీపడ్డారు. ధనుష్‌ హీరోగా వచ్చిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’,

శివకార్తికేయన్‌ హీరోగా ‘అయలాన్‌’ విజయ్‌సేతుపతి హీరోగా ‘మేరి క్రిస్‌మస్‌’ అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించిన ‘మిషన్‌– చాప్టర్‌–1’ విడుదలయ్యాయి.

ఈ నాలుగు సినిమాల్లో ‘మిషన్‌– చాప్టర్‌–1’ అనే చిత్రం విజయాన్ని సాధించి ముందు వరుసలో నిల్చుంది. ఈ చిత్రానికి కూడా నిర్మాత తెలుగువాడు రాజశేఖర్‌ కావటం

విశేషం. అంటే చిన్నగా చాపకింద నీరులా తమిళ సినిమారంగంలోకి తెలుగు నిర్మాతలు గట్టిగానే ఎంట్రీ ఇస్తున్నారు.

డివివి దానయ్య…

బ్లాక్‌బస్టర్‌ చిత్రాల నిర్మాత డివివి దానయ్యకూడా తమిళంలోని అనేకమంది పెద్ద హీరోల డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు అనేక తమిళ సినిమాలు చేయటానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తమిళ నిర్మాతలే చెప్తున్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ తర్వాత దానయ్య పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. కాకపోతే తన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతా తానై మోసింది దర్శక ధీరుడు రాజమౌళి కావటంతో సినిమా విడుదల తర్వాత ఈయన పెద్దగా కనిపించలేదు.

ప్రస్తుతం నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అనేక పెద్ద సినిమాలను పానిండియా సినిమాలుగా తీస్తూనే తమిళ హీరోల కోసం ఎదురు చూస్తున్నారు.

అతి త్వరలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భారీ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ సినిమా నిర్మాతలు గుసగుసలాడుతున్నారు.

టి.జి విశ్వప్రసాద్‌…

సినిమాలను కూడా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలాగా ఎంతో సిస్టమేటిక్‌గా రన్‌ చేస్తున్న కంపెనీ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. ఈ కంపెనీ అధినేత టి.జి విశ్వప్రసాద్‌.

ఆయన పక్కనే తోడుగా ఉండే మరో నిర్మాత వివేక్‌ కూచిభొట్ల. ఈ ఇద్దరు కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీని ఉరుకులు పెట్టిస్తున్నారు.

ఎంతో తక్కువ కాలంలో వీరు తమకంటూ ఇక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అనేక సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు.

ఈ బ్యానర్‌లో పవన్‌కల్యాణ్, ప్రభాస్, సమంత, రవితేజవంటి స్టార్స్‌తో పాటు నిఖిల్, అడివి శేష్‌ లాంటి హీరోలతో సైతం సినిమాలు తీసి పెద్ద హిట్లను ప్రేక్షకులకు అందించారు. విశ్వప్రసాద్‌ కూడా ఎంతో ముందు చూపుతో తమిళంలో తన ప్రొడక్షన్‌ హౌస్‌ను ఎస్టాబ్లిష్‌ చేసుకునే పనిలో పడ్డారు.

గతంలో అనేక తమిళ సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు నిర్మించి అక్కడ మార్కెట్‌ను సెట్‌ చేసుకున్నారు. రీసెంట్‌గా తమిళ టాప్‌ కమెడియన్‌ సంతానం హీరోగా నటించిన చిత్రం ‘‘వడక్కుపట్టి రామస్వామి’’ . ఆ చిత్రాన్ని నిర్మించి చక్కని విజయాన్ని తమిళనాట అందుకున్నారు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ వారు.

ఇలా గడిచిన రెండేళ్ల కాలంలో తెలుగు నిర్మాతలు ‘దిల్‌’ రాజు, టి.జి విశ్వప్రసాద్, డివివి.దానయ్య, యం. రాజశేఖర్‌ రెడ్డిలు తమిళ మార్కెట్‌పై కన్నేశారు, కొట్టేశారు.

మైడియర్‌ తమిళ్‌ ప్రొడ్యూసర్స్‌ అండ్‌ డైరెక్టర్స్‌ ఓ సారి చెక్‌ చేసుకోండి దేశమంతా తెలుగువారు ఏలటానికి సిద్దమవ్వుతున్నారు.

మీ జాగ్రత్తలో మీరుండండి. ఫరవాలేదులే అనుకుంటే అన్ని భాషల్లో మంచి సినిమాలు తీయటానికి రెడీ అయిన తెలుగు నిర్మాతలకు మీ సహాకారం అందించండి. ‘ట్యాగ్‌తెలుగు.కామ్‌’ అన్ని మంచి సినిమాలకు సపోర్టు చేస్తుంది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు తెలుగు ప్రొడ్యూసర్స్‌…

                                                                                                                                                                                     శివమల్లాల

Senior Actor Ravi Varma

Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.