ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ సీజన్ 18th 38 మ్యాచ్ ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 35 బంతుల్లో 53 పరుగులు ( 4 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. చెన్నై టీంలో అత్యధిక స్కోరు అతనిదే. సీనియర్ ప్లేయర్ శివం దూబే 32 బంతుల్లో 50 పరుగులు ( 2 ఫోర్లు 4 సిక్సర్లు) చేసి పెవిలియన్ చేరాడు. ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 32 పరుగులు చేసి (4 ఫోర్స్ 2 సిక్సర్లతో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
రచిన్ రవీంద్ర 6 పరుగులు, ఎంఎస్ ధోనీ 4 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. చేజింగ్ కోసం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 179 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, రికెల్టన్ లు ఫస్ట్ వికెట్ కు 6.4 ఓవర్లలో 63 పరుగులు చేశారు. రోహిత్ చెలరేగి ఆడటంతో 45 బంతుల్లో 74 పరుగులు ( 4 ఫోర్లు 6 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోని బౌలర్స్ ఎవరు ముంబై ఇండియన్స్ ను కట్టడి చేయలేకపోయారు.
శివ మల్లాల