Odela2: అసలైన రచ్చ రేపటి నుంచి మొదలంటున్న మేకర్స్

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఓదెల 2. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా నటించింది. ఈ క్రమంలోనే ఇవాళ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘తమన్నా నాగ సాధువుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియన్స్ ఈ సినిమాలో తమన్నా, విశిష్ట సింహల మధ్య పెర్ఫార్మెన్స్ పోటాపోటీగా ఉందని అంటున్నారు. శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది’’ అన్నారు.

ప్రొడ్యూసర్ డి మధు మాట్లాడుతూ.. ‘‘సుదర్శన్ 35 ఎంఎంలో ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడటం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు ముఖ్యంగా లేడీస్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. తమన్నా శివశక్తిగా అద్భుతంగా చేశారు. ఈ రోజును మరచిపోలేం… ఇంకా మున్ముందు గొప్ప సెలబ్రేషన్స్ ఉంటాయి’’ అన్నారు.
వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్‌లో ఆడియన్స్‌తో కూర్చుని సినిమా చూశా. వాళ్ల రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థియేటర్స్‌లో మొదలైన శివతాండవం రేపటి నుంచి మరింతగా అందరికీ చేరుతుంది’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *