కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. త్వరలో ‘ముత్తయ్య’ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ‘అరవైల పడుసోడు’ పాటను సమంత రిలీజ్ చేసింది. ఈ పాటను ఈ రోజు స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘అరవైల పడుసోడు..’ పాటను రిలీజ్ చేశారు. శివకృష్ణ చారి ఎర్రోజు క్యాచీ లిరిక్స్ అందించగా. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్వ్ కంపోజ్ చేశారు.’అరవైల పడుసోడు ఎగిరెగిరి పడతాడు తుమ్మాకో తంబాకో తెలవదులేండి…. ఇరవైలా ముసలోడు ఎవ్వనికీ ఇనడీడు తుండేసి బండేసె ఆగం సుండి.. ఎర్రి సోమరికాడు ఎడ్డి కొండడుకాడు జర్ర కిర్రాకు జేస్తాడు మట్టున జూడు..’ అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.