Karan Johar: ఇటీవలి కాలంలో కరణ్ జోహార్‌ను చూసిన వారు.. ఇప్పుడు చూస్తే పోల్చుకోవడం కష్టమే. అంతలా మారిపోయింది ఆయన రూపం. అసలు ఆయనకు ఏమైంది? బక్క చిక్కిపోయి.. కళనేది లేకుండా.. క్లీన్ షేవ్‌తో పూర్తిగా మారిపోయారు. అసలు ఎంత స్మార్ట్‌గా.. స్టైలిష్‌గా ఉండేవారు కదా.. ఇప్పుడు ఏమైంది అలా తయారయ్యారని నెటిజన్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఆరోగ్య సమస్య లేదంటే మరెదైనా కారణమా? అనేది తెలియకుండా ఉంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ప్రచార జిమ్మిక్ అంటుంటే.. మరికొందరు మాత్రం అనారోగ్య సమస్య అని తేల్చేస్తున్నారు. కరణ్ జోహార్ ఇటీవలే తన సొంత కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మెజారిటీ షేర్స్ అమ్మేసి.. ఇకపై సినిమాలు తీయనని కుండ బద్దలు కొట్టేశారు. ఒకవేళ తీసినా కూడా 80-90కోట్ల బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తానని తేల్చేశారు. ఇదంతా ఓకే కానీ ఈ లుక్ ఏంటో ఏమీ అంతుబట్టకుండా ఉంది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : అయోధ్యలో తెలుగు దర్శకులకు అవార్డులు