అమెరికా వద్దు ఇండియా ముద్దు అనుకోండి..మీ అకౌంట్‌లో 44 కోట్లు ఉన్నట్లే…
అమెరికా ఎన్నికల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధివిధానాలు రోజుకో విధంగా మారుతున్నాయి.
ప్రపంచమంతా డాలర్‌తో మారకపు విలువను లెక్క వేయటంతోనే సమస్యలన్నీ.
షేర్ మార్కెట్‌లో తలలుపండిన మేధావులు సైతం అగ్రరాజ్యం అధ్యక్షుడు పెద్దన్నయ్య ట్రంప్
ఏ రోజు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో వాటివల్ల షేర్‌మార్కెట్ ఏ రోజు పడుతుందో ఏరోజు లేస్తుందో అర్దంకాక తలలు పట్టుకుంటున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుండి షేర్ మార్కెట్ విలవిలలాడుతుండటం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.
ముఖ్యంగా ఈరోజు ప్రతిపాదించిన ప్రతిపాదన చాలా కొత్తదన్నట్లు పెద్దన్నయ్య మాట్లాడుతున్నారు.
భూతలస్వర్గం అమెరికాలో శాశ్వత స్థానం పొందాలంటే అక్షరాల 43కోట్ల 50 లక్షల రూపాయలను అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలట.
(అమెరికా వద్దు ఇండియా ముద్దు అనుకోండి..మీ అకౌంట్‌లో 44 కోట్లు ఉన్నట్లే… )
వేలంవెర్రిగా అమెరికా వెళ్లటమే తమ జీవితాశయం అనుకునేవారు అత్యధిక సంపన్నులు 44 కోట్లు వెచ్చించి భూతల స్వర్గం టికెట్‌ను కొనుక్కోవచ్చు.
అలాకాకుండా ఒక్క నిమిషం ఆలోచిస్తే అక్కడికి వెళ్లటానికి పెట్టే ఖర్చుతో భారతదేశంలోనే ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టి వందలమందికి ఉద్యోగం ఇవ్వొచ్చు.
అమెరికాకి వెళ్లాలి అనే మైండ్‌సెట్ మార్చుకుంటే వారివారి దేశాల్లోనే ఉండి ఎంతో అభివృద్ధిని సాధించి తమ సొంతవారికి ఉపాధి కల్పించినవారవుతారు.
ఏదేమైనా మా ఇల్లు బంగారం పక్కిల్లు ఎందుకు పనికిరాదు అనే మైండ్‌సెట్ ఉన్న ట్రంప్ వల్ల అగ్రరాజ్యం ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది.
ఇప్పటికే డాలర్ విలువ పెరుగుతుండటంతో ఆర్ధిక వ్యవస్థ అపసవ్య దిశలో నడుస్తుంది.
అనేక పెద్ద కంపెనీల్లో ఉద్యోగులను నిలిపివేయటం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
అలాగే అక్రమంగా వలస ఉంటున్న అనేకమంది విదేశీయులను బలంవంతగా ట్రంప్ గెంటివేయటం ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాం.
అక్రమంగా వారిదేశంలో ఉంటూ వారితో చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కొంటూ ఉండే పరిస్థితులు మనకెందుకు?
మనదేశం మనం వెళ్లిపోదాం? అనే ఆలోచనలతో చాలామందికి ఇప్పుడిప్పుడే ఆలోచనలు మొదలవుతున్నాయట.
ఇలాంటి ఆలోచలను కార్యరూపం దాల్చితే మొదటికే మోసం వస్తుందని ట్రంప్ అన్నయ్యకు అర్థమయ్యే టైమ్ దగ్గరలోనే ఉంది అని పలు వార్తాపత్రికలు హోరెత్తిత్తున్నాయి.
షేర్ మార్కెట్‌లో విలువలు రాత్రికిరాత్రే ఆవిరవుతున్నాయి.
కొత్తగా ఆ దేశం వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్న వారి సంఖ్య అమాంతం తగ్గుతుంది.
యం.యస్‌ల కోసం అమెరికా వెళ్లి బిక్కుబిక్కుమంటూ బతికేకంటే ఉన్న దేశంలో ఉండి కష్టపడితే తమ శ్రమకు తగిన ప్రతిఫలం రాకపోదా?
అని ఆలోచన చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.
ట్రంప్ అన్నయ్య అందరికి మీరు షరతులు పెడుతున్నాను అనుకుంటున్నారు కానీ,
చాపకింద నీరులా మీకు తెలియకుండా మీరే తడిసే రోజు అతి దగ్గరలో ఉంది.
మీ దగ్గర ఉన్న మా వాళ్లను ప్రశాంతగా ఉండనివ్వండి.
కొండంత టాలెంట్‌తో పాటు ఆకాశమంత కోరికలతో సొంతవాళ్లను వదిలి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి
వేరే దేశం నుండి వచ్చిన వాళ్లను ఇకనుండైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి.
మీ దేశాన్ని మీరు గౌరవించటం గొప్ప అనుకోవటం తప్పేంలేదు, అస్సలు తప్పుకాదు.
అమెరికా ఫస్ట్ అనే మీ తలంపు చాలా గొప్పది. అది మీ హక్కు, మీ బాధ్యతకూడాను.
మీరు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు.
కానీ దాదాపు 100 దేశాలనుండి వచ్చిన విదేశీయులు ఎంతో పాటుపడితేనే మీ దేశం అంతగా అభివృద్ధి చెందిందని గుర్తుంచుకుంటే మంచిది.
ఏదేమైనా మీరు ఫైనల్‌గా ఒక రూల్‌బుక్ పెట్టి ఈ నాలుగేళ్లకు ఇదే ఫైనల్ రూల్స్ అని రూపొందించండి.
ఆ రూల్స్‌కి ఇష్టపడిన వారు మాత్రమే మీతో ఉంటారు. లేదంటే వారి దారి వారు చూసుకుంటారు. రోజుకో రూల్‌తో డోన్ట్ కన్ఫూజ్ మిస్టర్ ట్రంప్‌గారు …..
శివమల్లాల
Also Read This : తెలుగు, తమిళ, కన్నడ మిక్స్‌డ్ మసాలా మణికొండలో ఉంటుంది…