...

దూరంగా ఉండే ప్రేమికులకు దగ్గరయ్యే తండేల్‌…

రివ్యూ– థండేల్‌ మూవీ
విడుదల తేది– 07–02–2025
నటీనటులు– నాగచైతన్య, సాయిపల్లవి, పృథ్వీ, కల్పలత, రంగస్థలం మహేశ్, కరుణాకరన్, పార్వతీశం తదితరులు
కథ– కార్తీక్‌ తీట
ఎడిటర్‌– నవీన్‌ నూలి
సినిమాటోగ్రఫీ– శ్యామ్‌ ధత్‌
సంగీతం– దేవీ శ్రీ ప్రసాద్‌
నిర్మాత– గీతా ఆర్ట్స్‌ ప్రెజెంట్స్, బన్ని వాసు
దర్శకత్వం– చందూ మొండేటి

కథ :

శ్రీకాకుళం జిల్లా డి. మచిలేసం గ్రామానికి చెందిన రాజు ( నాగచైతన్య) , సత్య (సాయిపల్లవి) పక్క పక్క ఇళ్లల్లో ఉండే జాలరుల కుటుంబానికి చెందినవారు.

ఇద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చిప్రేమ. ఒక్క ఫోన్‌ కాల్‌ మాట్లాడటానికి నెల రోజులపాటు ఇద్దరు ఒకరినొకరు ఎదురు చూస్తుంటారు.

9 నెలలు సముద్రంలో ఉండే జాలరులు 3 నెలలు హాయిగా బ్రతకటం కోసం ఏడాదంతా వారి కుటుంబాలు ఆనందంగా ఉండటం కోసం

ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరం గుజరాత్‌ దగ్గరలో చేపలు పడుతుంటారు.

ఫోన్‌ సిగ్నల్‌ దొరికినప్పుడు వేరే లోకమే లేకుండా మాట్లాడుకునే ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య ఏం జరిగింది?

సడెన్‌గా సత్య, రాజును ఎందుకు వద్దు అనుకుంటుంది? రాజు పాకిస్థాన్‌కి ఎందుకు వెళతాడు?

చివరికి వీరు కలుస్తారా? లేదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం సినిమా థియేటర్‌లోనే దొరుకుతుంది.

నటీనటుల పనితీరు :

నాగచైతన్య, సాయిపల్లవిలు గతంలో కూడా కలిసి ‘లవ్‌స్టోరీ’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అందుకే ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.

ఇద్దరు మంచి ప్రేమికులుగా నటించటంతో పాటు కథలో ఉన్న ట్విస్ట్‌లకు తగ్గట్లుగా వీరి హావభావాలు ఉన్నాయి.

సాయిపల్లవి స్క్రీన్‌పై ఉంటే ఆ క్యారెక్టర్‌కి తగినట్లుగా బిహేవ్‌ చేస్తుంది అని అందరికి తెలుసు.

తండేల్‌ చిత్రంలో ఆమెతో పోటిపడి నటించారు నాగచైతన్య. చైతన్య తన లైన్‌ని క్రాస్‌చేసి మరి యాక్ట్‌చేశారనిపించింది.

చాలాచోట్ల నువ్వా? నేనా? అన్నట్లుగా ఇద్దరు నటించారు. వారిద్దరి నటన చాలా నేచురల్‌గా ఉంది.

సాయిపల్లవి కళ్లే కాదు తన ఒంటి మీదున్న వెంట్రుకలతో కూడా యాక్టింగ్‌ చేస్తుంది అన్నట్లుగా ఒక సీన్‌లో అనిపిస్తుంది.

(సాయిపల్లవికి గూస్‌బమ్స్‌ వచ్చే సీన్‌)… మిగతా నటీనటులకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది.

ఉన్నంతలో తమిళనటుడు కరుణాకరన్‌కి కొంచెం మంచి పాత్ర దొరికందని చెప్పాలి. మిగతావారంతా పరావాలేదనిపించారు.

టెక్నికల్‌ విభాగం :

కొన్ని సినిమాలకు టెక్నీషియన్ల టాలెంట్‌ ఎంత ఉపయోగపడుతందో తండేల్‌ చూస్తే అర్థమవుతుంది.

ముఖ్యంగా ఒక్క చిన్న లైన్‌తో తీసే ప్రేమకథలకు సంగీతదర్శకుడు, కెమెరామెన్‌ల పనితనంతోనే ఆ కథలు మరో లెవెల్‌కి వెళతాయి.

తండేల్‌లో బుజ్జితల్లి అనే డైలాగ్‌ వచ్చిన ప్రతిసారి దేవీ శ్రీ ప్రసాద్‌ కనిపించారు.

కెమెరామెన్‌కి సముద్రం చుట్టూ నీళ్లు, చిన్న ఊరు ఉంటే ఒక ఆట ఆడుకోవచ్చు.

శ్యామ్‌దత్‌ నిజంగానే కెమెరాతో ఒక ఆట ఆడుకున్నాడు.

ఎడిటర్‌ నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాగేంద్ర పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌ :

ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌
నాగచైతన్య, సాయిపల్లవిల నటన
దేవీ శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌ పాయింట్స్‌ :

చిన్న కథ
ఫస్టాఫ్‌ స్లో నేరేషన్‌
టూ మచ్‌ సినిమాటిక్‌ లిబల్టీ

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

దూరంగా ఉండే ప్రేమికులకు దగ్గరయ్యే తండేల్‌…

రేటింగ్‌ : 3/5 
శివమల్లాల

Thandel REVIEW
Thandel REVIEW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.