రివ్యూ : గాంధీ తాత చెట్టు
విడుదల తేది :23–01–2025
నటీనటులు : సుకృతివేణి, ఆనంద చక్రపాణి, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్, రాగ్‌మయూర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : విశ్వ దేవబత్తుల
సంగీతం : రీ
నిర్మాత : సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, శేష సింధూరావ్
దర్శకత్వం : పద్మావతి మల్లాది
కథ :
13 ఏళ్ల పాప గాంధీ (సుకృతి). మంచికి, మంచి పేరుకు ఆడేంది,
మగేంది అనుకుని గాంధీని ఫాలో అయ్యే మంచి తాత రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) మనవరాలు పుట్టగానే గాంధీ అని పేరు పెడతాడు.
సుకృతి చదువుల్లో చాలా తెలివైన అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఈ సమాజంలో ఎలా బతుకుతుందో అనుకునే అమ్మ.
అలా ఆమె ఎందుకు అనుకుంటుంది అంటే ఈ పాపకు అబద్దం ఆడటం రాదు,
అందరిని మంచే అనుకుంటుంది, నిజమే మాట్లాడుతుంది, నోరెత్తి పల్లెత్తు మాట ఎవరిని అనదు…
అందుకే గాంధీ అమ్మ యాదమ్మ ఈ అమ్మాయి ఎలా బతుకుతుందో అనుకుంటుంది.
సరిగ్గా పంటలు పండక ఇబ్బందిపడే ఊరి రైతులు తర్వాత కాలంలో చెరుకును పండిస్తారు.
పండించిన చెరకు పంటను కొనే దిక్కులేక ఇబ్బంది పడుతున్న తెలంగాణాలోని ఒక మారుమూల పల్లెటూరి ఆలూరి కథే ఈ సినిమా.
13 ఏళ్ల పాప తన తాతతో ఎలా ఉంటుంది ఆ తాత తనకు నేర్పిన నడత ఏంటి? ఎందుకు ఊరు బావుండాలి?
రైతు రాజు అని ఎందుకు అంటారు? భూమి అమ్ముకుని పుట్టిన ఊరు విడిచి వెళ్లే వాళ్ల బతుకులు ఎంత ఇబ్బందిగా ఉంటాయో తలపండిన తాత చెప్పే కబుర్లే ఈ సినిమా.
గంటా యాభై నిమిషాల ఈ చిత్రంలో అనేక విషయాలు ఆలోచింపచేసే విధంగా ఉంటాయి.
ఆ ఊరంతా కలిసి పాపకు ఎందుకు అండగా నిలబడ్డారు? ఊరంతా చేయలేని పని ఆ పాప ఏంచేసింది అనేది తెరపైనే చూడాలి.
నటీనటుల పనితీరు :
ఆనంద చక్రపాణి తాతగా అలరించారనే చెప్పాలి. ఈ సినిమా చూసిన ఎవరికైనా తన తాత గుర్తుకు వస్తారు.
అంతలా తాతయ్యగా ఒదిగిపోయారాయన. మనవరాలు గాంధీ పాత్రలో మొదటిసారి తెరపై కనిపించిన సుకృతివేణికి మంచి మార్కులే పడ్డాయి.
ఈ చిన్నకథను చెప్పిన తీరు చాలా ముచ్చటేసింది. గాంధీ తండ్రి దివాకర్, తల్లి యాదమ్మ పాత్రలతో పాటు గాంధీ స్నేహితులుగా నటించిన ఇద్దరు పిల్లలు చక్కగా కుదిరారు.
టెక్నికల్ విభాగం :
కెమెరా విశ్వ చిన్న కథను ఎంతో హృద్యంగా మలచటానికి దర్శకురాలకి ఎంతో ఉపయోగపడ్డారు.
సంగీత దర్శకుడు రీ కథకు అడ్డుపడకుండా సన్నివేశాలకు తగినట్లుగా తన సౌండ్‌తో అలరించాడు.
దర్శకురాలు పద్మావతి మల్లాది అదృష్టం మామూలుగా లేదు.
తన స్నేహితురాలు సింధూ సుకుమార్ అసిస్టెంట్ అవ్వటంతో ఆమెకు దర్శకురాలిగా మంచి అవకాశం దొరికింది.
ఈ సినిమాకు అవార్డులు బోలెడు వస్తాయి కానీ థియేటర్లలో ప్రేక్షకుల రివార్డు దక్కించుకోవటం చాలాకష్టం.
తన వంతుగా తను చెప్పిన బ్యూటిఫుల్ కథని తెరపై పోట్రే చేయగలిగింది . అంతవరకు మాత్రమే ఈ సినిమాని ఆలోచించాలి.
ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ అనే ౖటెటిల్ లేకపోతే ఇంత హైప్ ఉండేది కాదు.
సుకుమార్ కూతురు సుకృతి ముఖ్యపాత్రలో నటించటంతోనే మైతీమూవీస్ వంటి సంస్థ ముందుకు వచ్చి సినిమాని విడుదలచేసింది.
లేదంటే ఈ సినిమాకి ఇంత హైప్ రిలీజ్ ఖచ్చితంగా ఉండేది కాదు. సింగిల్పాయింట్తో వచ్చే ఇటువంటి సినిమాలు అనేకం విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఆనంద చక్రపాణి, సుకృతీల నటన, సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
ఫైనల్ వర్డిక్ట్ :
అవార్డులకు ఓకే..రివార్డులకు నాట్ ఓకే…
రేటింగ్ : 2.5/5
శివమల్లాల
Also Read This : ఆరు నెలల్లో నాలుగు విశేషాలు
