డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి
వెంకీ మామతో వరుసగా మూడు సినిమాలు చేశాడు.
ఎఫ్ 2, ఎఫ్ 3 అలాగే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
దర్శకత్వంలో ఆయన బాగా తృప్తి చెంది.. ఆడియన్స్ తన సినిమాలను ఇక చాలు అని ఫీలయ్యే వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని
ఆ తర్వాత నటనలోకి దిగి నటుడిగా మారిపోతానంటూ చెప్పుకొచ్చాడు.
ప్రేక్షకులు తన సినిమాలను ఆదరిస్తున్నంతవరకు దర్శకుడిగా మరిన్ని చిత్రాలను తెరకెక్కిస్తానన్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.
పదేళ్లలో వరుస హిట్ సినిమాలను తెరకేక్కించడం ఆయనకు మాత్రమే దక్కిన రికార్డు.
అలాగే విక్టరీ వెంకటేష్‌తో చేసిన మూడు సినిమాలు మూడు సార్లు మిలియన్ డాలర్లను, మూడు సార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీకి లక్కీ డైరెక్టర్‌గా మారిపోయారు.
టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అంతటి సక్సెస్ రికార్డును సొంతం చేసుకున్న దర్శకుడిగా అనిల్ నిలిచాడని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్…
