బతుకుపోరాటంలో బంధీ అవ్వటం అనేది ఎవరి జీవితానికైనా మామూలు విషయమే.
కానీ, ఒక నటునికి అలాంటి పరిస్థితి వస్తే మాత్రం అది అగమ్యగోచరం.
మనిషి మనసేమో సినిమాపై ఆ మనిషి మాత్రం తాను చేసే పనిపై ఉంటుంది. ఇలా ఉండే ఎంతోమంది నటులు 80ల నుండి ఉన్నారు.
‘దాసి’ సినిమాలో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఆనంద చక్రపాణి మరో రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత
చిత్ర పరిశ్రమ మద్రాస్‌లోనే ఉండటంతో హైదరాబాద్‌లో అంతంత మాత్రమే షూటింగులు ఉండటంతో
తన కలైన కళామతల్లికి స్వస్తి చెప్పి మీడియా రంగంవైపుకు ఎంట్రీ ఇచ్చారు.
ఆ రోజుల్లో ఆయన కన్న కల ఎంత గొప్పగా గట్టిగా కన్నారో కానీ ‘మల్లేశం’ సినిమాతో ఆయన కల నిజమైంది.
ఆ కల కలకాదని నిజమేనని తన ముందుకి కళామతల్లి వచ్చి ఆనంద చక్రపాణిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది.
ఆ రోజు నుండి చక్రపాణి దాదాపు 40 సినిమాల పైనే నటించారు.
పవన్‌కల్యాణ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రవితేజ, రానా ఇలా అనేకమంది హీరోలుగా నటించిన
పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు వంద మార్కులు తెచ్చుకున్నారు.
ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ జనవరి 24న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ఆయనతో ప్రత్యేకమైన ఇంటర్వూ చేసింది.
సమాజానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలను ఆయన మాట్లాడారు. అవేంటో మీరు చూసేయండి. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : రియల్ హీరో ఆదిత్యారామ్…
