క్రిస్మస్ సందర్భంగా ‘బరోజ్ 3డి’ను పాన్ ఇండియా భాషల్లో (మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ) విడుదల చేశారు.
మరి, ఈ ఫాంటసీ ఫిల్మ్ ఆడియన్స్ అందర్నీ మెప్పించేలా ఉందా? ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది…..
గోవాలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన పోర్చుగీసు రాజు డ గామాకు బరోజ్ నమ్మిన బంటు.
నాలుగు వందల ఏళ్లుగా గోవాలోని ఆ రాజ వంశానికి చెందిన నిధిని కాపాడుతూ వస్తున్నాడు.
డ గామా వారసులు వస్తే వాళ్లకు అప్పగించాలని ఎదురు చూస్తుంటాడు.
ఆ రాజ వంశంలో పదమూడో తరంలో అమ్మాయి ఇసాబెల్లా తండ్రి రాన్ మాథ్యూ తో కలిసి గోవా వస్తుంది.
ఇసాబెల్లాకు డ గామా రాజవంశ నిధిని బరోజ్ అప్పగించాడా? లేదా? ఆ చిన్నారికి తానొక రాజ వంశస్థురాల్ని అనే సంగతి తెలిసిందా? లేదా?
నిధిని సంరక్షించే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? దుష్టశక్తులు ఆ నిధి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశాయి?
ఇసాబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ :
ఇండియన్ ఆడియన్స్ త్రీడీ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. హాలీవుడ్ నుంచి వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిస్నీ ఫిలిమ్స్ ని బాగా చూస్తున్నారు.
ఆ కథల్లో మన హీరోలు ఉంటే హ్యాపీగా ఫీలవుతారు. కానీ, మన హీరోలు తీసే సినిమాలు ఆ టైపులో ఉంటే,
మన ఎమోషన్స్ మ్యూజిక్‌ను వెస్ట్రన్ ఇన్‌ఫ్లూయెన్స్ డామినేట్ చేస్తే? విజిల్స్ వేయడం కష్టం.
మోహన్ లాల్ వంటి స్టార్ హీరో సినిమా చేస్తే… మన జానపదాన్ని తెరపై చూడాలని కోరుకుంటారు.
కానీ, మోహన్ లాల్ అందుకు కంప్లీట్ రివర్సులో ‘బరోజ్’ తీశారు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ‘బరోజ్ త్రీడీ’ మొదలైంది. ఫాదో గీతంతో ఈ సినిమాను ప్రారంభిద్దామని ఆయన చెబుతారు.
ఫాదో గీతం అంటే ఏమిటి? అని ఆలోచనలో పడిన ప్రేక్షకులకు స్క్రీన్ మీద వచ్చే ఫోర్చుగీసు సాంగ్ చిన్నపాటి షాక్ ఇస్తుంది.
సినిమా ఎండింగ్ వరకు ఆ షాక్ కంటిన్యూ అవుతుంది.
మోహన్ లాల్ ను స్క్రీన్ మీద ఎక్కువ సేపు చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వెస్ట్రన్ ఆర్టిస్టులు,
సింక్ అవ్వని సన్నివేశాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో బోరింగ్ మూమెంట్స్ పెరుగుతూ వెళ్లాయి.
క్యారెక్టర్స్ డిమాండ్ మేరకు వెస్ట్రన్ ఆర్టిస్టులను తీసుకోక తప్పదు. కానీ, స్క్రీన్ మీద ఎక్కువ సేపు వాళ్లు కనిపించడంతో పాటు వాళ్ల నటన మన ప్రేక్షకులకు నచ్చేలా లేదు.
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బావుంది. అండర్ వాటర్ సీక్వెన్సులో త్రీడీ విజువల్స్ అప్ టు ద మార్క్ లేవు.
సాంగ్స్, రీ రికార్డింగ్ అయితే హాలీవుడ్ సినిమాను తెలుగు డబ్బింగ్‌లో చూసిన ఫీలింగ్ కలిగించాయి.
‘ఇసాబెల్లా…’ సాంగ్ వచ్చినప్పుడు సీట్స్ నుంచి లేచి వెళ్లిపోవాలనే ఫీలింగ్ థియేటర్లలో ప్రేక్షకులకు కలుగుతుంది.
ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగా చేశారు.
మోహన్ లాల్ లోని నటుడిని ఆయనలోని దర్శకుడు డామినేట్ చేశాడు. హీరోయిజం చూపించనివ్వలేదు.
అలాగని నవ్వించనులేదు. మోహన్ లాల్ స్థాయికి తగ్గ నటన చూపించే సన్నివేశాలు రాయలేదు.
కథలో కీలక పాత్ర ఇసాబెల్లా చేసిన మాయా రావు వెస్ట్రన్ క్యారెక్టర్ లో బావుంది. కానీ, నటన అంతంత మాత్రమే.
మిగతా క్యారెక్టర్లలో వెస్ట్రన్ ఆర్టిస్టులు ఎక్కువ. క్యారెక్టర్లకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు.
దర్శకుడిగా, నటుడిగా మోహన్ లాల్ చేసిన డబుల్ డ్యూటీ వృధా అయ్యింది కథ లోని కొన్ని సన్నివేశాలు అంశాల పరంగా కొన్ని విషయాల్లో మాత్రమే సినిమా మెప్పిస్తుంది.
ఈ సినిమాకు 3D లో చూడడానికి బాగుంది కానీ ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వదు…
Rating : 2/5
Also read this : క్రిస్‌మస్ వేళ త్రిష ఇంట్లో అశుభం
