” సోలో బతుకే సో బెటర్ ” చిత్రంతో మన అందరికి పరిచయం అయినా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి.
ప్రస్తుతం అల్లరి నరేష్ మరియు అమ్రితా అయ్యర్ జంటగా బచ్చలమల్లి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
హాస్య మూవీస్ ద్వారా రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నర్మించారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో అమ్రితా అయ్యర్ తన సక్సెస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు.
అమ్రితా అయ్యర్ మాట్లాడుతూ : ” నేను ఎంచుకునే స్టోరీస్ అన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నాయ్ .
నాకు మంచి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలి అని ఉంది. “బిగిల్ ” సినిమా లో మంచి పాత్ర వచ్చింది.
” సివంగివె ” అనే పాట ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అనుకోలేదు .
ఆ తరువాత “30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” సినిమా లో ” నీలి నీలి ఆకాశం ” పాట నేను ఎప్పటికి వింటాను అంతలా నాకు కనెక్ట్ అయ్యింది.
ఆ తరువాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో “హునుమాన్ ” మూవీలో అవకాశం రావడం ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
అస్సలు అనుకోలేదు పాన్ ఇండియా సినిమా లో నేను వర్క్ చేస్తా అని అనుకోలేదు అందులో ” పూలమ్మే పిల్ల ” పాట ప్రేక్షకులకి ఎంతగానో నచ్చింది.
ఇప్పుడు నటించిన బచ్చలమల్లి కూడా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న.
నరేష్ గారితో తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అయన దగ్గర చాలా నేర్చుకున్నాను ” అని అన్నారు .
సంజు పిల్లలమర్రి
Also Read This : బన్నీ ఐ లవ్ యూ– నటకిరీటి రాజేంద్ర ప్రసాద్