కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలిసిందే.
దాదాపు 15 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి, ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రింగ్‌లు మార్చుకుని ఒక్కటి కాబోతున్నారు.
గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కీర్తి సురేష్, ఆంటోనీలు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.
ఇందుకు సంబందించిన వెడ్డింగ్ కార్డు కుడా సోషల్ మీడియాలో ద్వారా పోస్ట్ చేసింది.
తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో నటించడం ద్వారా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బేబీ జాన్‌తో సందడి చేయనుంది.
డిసెంబర్ 12వ తారీకు హిందూ సాంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళి కట్టబోతున్నారు.
అదే రోజు సాయంత్రం గోవాలోని ప్రముఖ చర్చ్‌లో రింగ్‌లు మార్చుకుని ఏసు క్రీస్తు సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.
మొత్తానికి వీరి వివాహం రెండు మతాల సాంప్రదాయాలతో జరగబోతుంది.
సంజు పిల్లలమర్రి
Also Read This : నా జన్మలో ఆర్జీవీతో పనిచేయను…