Sandeep Reddy Bandla :
కూటికి, గుడ్డకి రాని ఆటలు ఆడితే ఏంవస్తుంది అని మన పెద్దోళ్లు ఎప్పుడు పిల్లల మంచికోరి చెప్తుంటారు.
ఆ మాటను రివర్స్ చేస్తూ కేవలం నేను ఆడే బ్యాడ్మింటన్ ఆట వల్లనే ఈ రోజు ఓ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది.
అలాగే ప్రశాంత్‌నీల్ వంటి గొప్ప దర్శకుల దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అవకాశం వచ్చింది.
తన ఆడే బ్యాట్మెంటన్ ఆటే నాకు ‘దిల్’రాజు గారి వంటి పెద్ద సంస్థలో తొలిసినిమా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది అంటూ తన గేమ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారాయన.
ప్రభాస్‌గారితో ఆలా కూర్చుని వందల రోజులు కబుర్లు చెప్పుకున్నామని ఆ డేస్‌ని ఎప్పటికి మరువనని అంటూ
తన స్టోరీని సెన్సాఫ్ హ్యూమర్‌లో నవ్వుతూ నవ్విస్తూ, పంచులు వేస్తూ, మధ్య మధ్యలో కంటతడి పెట్టుకుని ఎమోషన్ అవుతూ
చుట్టూ ఉన్న వారిని ఎమోషనల్‌గా ఫీలయ్యేటట్లు చేశారు ‘జనక అయితే గనక’ దర్శకుడు సంధీప్‌రెడ్డి బండ్ల.
గతనెలలోనే విడుదలవ్వాల్సిన తన సినిమా వర్షాల కారణంగా విడుదల వాయిదా పడింది.
ఆ సమయంలో అనుకోకుండా తన తల్లి మరణించిందని తాను దర్శకత్వం వహించిన తొలిచిత్రానికి ఎంతో మంచి పేరొచ్చింది.
కానీ మా అమ్మకి నా సినిమా చూపించలేకపోయానని తల్లడిల్లిపోయారాయన.
సినిమాలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కూతురు గాయత్రి మరణం తర్వాత పరామర్శిద్దామని ఆయన దగ్గరకి పోతే
ఆయన నా వైపు చూస్తూ ‘జనక అయితే గనక…’ ఇలాంటివి తప్పదు అంటూ ఆయన కూతురి ఫోటో చూపించారని ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదని అన్నారు దర్శకుడు సంధీప్.
తన సొంతూరుకి వెళ్లాలంటే ట్రైను దిగిన తర్వాత నాలుగు కిలోమీటర్లు నడిస్తేగాని ఇంటికి వెళ్లలేను.
సినిమాలే పెద్దగా చూడకుండా సినిమాని ఎలా డైరెక్ట్ చేశారు అనే ఆయన స్టోరీ చాలా స్పెషల్‌గా అనిపించింది.
తిరుపతి దగ్గర చిన్న ఊరు నుండి బయలుదేరిన ప్రయాణంతో ఈ రోజు ఒక పెద్ద సంస్థలో కథ చెప్పి ఒప్పించి సినిమా చేయటం అనేది ఎంతోమంది సినిమావారికి ఇన్స్‌పిరేషన్‌గా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
రజనీకాంత్, అలియాభట్, శ్రీనువైట్ల, గోపిచంద్, సుధీర్‌బాబు వంటి పెద్ద సినిమాలతో పాటు వచ్చిన మా సినిమాలో సుహాస్‌లాంటి కంటెంట్ ఉన్న నటుడు నటించటంతో పాటు రాజుగారు,
హర్షిత్‌లు మాకు తోడవ్వటంతో ఈ సినిమా విజయం సాధించింది అన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలను ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ముచ్చటించారాయన. ఇంటర్వూ బై శివమల్లాల