Heart Attack :
యువకులలో పెరుగుతున్న గుండెపోటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
గతంలో పునీత్ రాజ్‌కుమార్, కేకే, రాజు శ్రీవాస్తవ్ వంటి సెలబ్రిటీలు ఫిట్‌నెస్ కోసం కష్టపడి మరణించడం, ఖమ్మంలో ఇద్దరు యువకులు జిమ్ చేసిన తర్వాత గుండెపోటుకు గురై మరణించడం లాంటి ఘటనలు జిమ్ చేయడం ప్రమాదకరమా అనే ప్రశ్నకు దారితీస్తున్నాయి. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు వైద్యులు ఏమంటున్నారు అంటే?
అధికంగా వ్యాయామం చేయడం వల్లే గుండెపోటు రాదు. శరీరంలో అప్పటికే ఉన్న బ్లాక్స్, దాచిన వ్యాధులు కుడా కారణమవుతాయి అంటున్నారు, అలాగే జిమ్ చేయడం మంచిదే, కాని అతిగా వ్యాయామం చేయడం ప్రమాదకరం. ప్రతి ఒక్కరి శరీర సామర్థ్యం ఒకేలా ఉండదు కాబట్టి కోచ్ సలహాలు పాటించడం చాలా ముఖ్యం. రోగాలను ముందుగానే గుర్తించి చికిత్స చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు, అందుకోసం కనీసం మూడు నెలలకు ఒక సారైనా బాడీ చెక్ అప్ చేయించుకోవడం మంచిది అని సూచించారు.
గుండెపోటు ఎప్పుడు రావచ్చు?
గుండె రక్తనాళాల్లో చీలిక ఏర్పడితే ఎవరికైనా గుండెపోటు రావచ్చు.
కొంతమందిలో బ్లాక్స్ లేకపోయినా అకస్మాత్తుగా రక్తం గడ్డ కడుతుంది.
క్లాట్స్ ఏర్పడే తత్వం సహజంగానే ఉన్న కొందరికి వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యం సహకరించనప్పుడు జిమ్ చేయడం ప్రమాదకరం.
బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహాతోనే జిమ్ చేయాలి.
జిమ్‌లో చేసే పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణం కావచ్చు.
ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు, గుండెపోటు చరిత్ర ఉన్న కుటుంబీకులు జాగ్రత్తగా ఉండాలి.
గంటల తరబడి వ్యాయామం చేయడం మంచిది కాదు. శరీరం సామర్థ్యం ఆధారంగా 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుంది.
ముఖ్యమైన విషయాలు:
ముఖ్యంగా కార్డియో ఎక్సర్‌సైజుల తరువాత 2-5 నిమిషాలు విరామం తీసుకోవాలి.
ఛాతి ఎడమ భాగంలో నొప్పిగా అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపి వైద్యుడిని సంప్రదించాలి.
ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు. శరీర సామర్థ్యం ఆధారంగా వ్యాయామం చేయాలి.
జిమ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ శరీర పరిస్థితిని బట్టి, వైద్య సలహా మేరకు వ్యాయామం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఈ విషయాలని మనసులో ఉంచుకోవాలి:
జిమ్‌కు వెళ్లే ముందు మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది.
వ్యాయామం చేసేటప్పుడు శరీర సంకేతాలను గమనించాలి. అలసటగా అనిపించినా, ఛాతి నొప్పిగా ఉన్నా వెంటనే వ్యాయామం ఆపేయాలి.
వ్యక్తిగత శిక్షకుడి (Trainer) సహాయం తీసుకోవడం వల్ల వ్యాయామాలు సరైన పద్ధతిలో చేయడానికి, శరీర సామర్థ్యాన్ని బట్టి వ్యాయామాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది.
చివరిగా:
జిమ్‌లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి, గుండెపోటు వంటి వ్యాధులు తగ్గించడానికి జిమ్ సహాయపడుతుంది.
Also Read This Article : సమ్మర్ లో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే.. మంచి చిట్కాలు

Also Read This Article : సినిమా రివ్యూలను అడ్డుకోవాల్సిందేనా?