OG Pawan Kalyan:టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఆయన నిమగ్నం అయి ఉన్నారు.
ఇక సినిమాల విషయం మాట్లాడుకుంటే క్రిష్ జాగర్లమూడితో భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు,
యువ దర్శకుడు సుజిత్ తో ఓజి, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తున్నారు.
అయితే ఇవి మూడు కూడా ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకున్నాయి.
నిజానికి వీటిలో అన్ని సినిమాల పై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి నమ్మకాలు ఉండగా ముఖ్యంగా సుజిత్ తీస్తున్న ఓజి పై వారు విపరీతంగా అంచనాలు పెట్టుకున్నారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, సలార్ నటి శ్రియ రెడ్డి కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల ఓజి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.
ఈ మూవీని పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.
కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజా ఇండస్ట్రీ వర్గాల న్యూస్ ప్రకారం ఓజి మూవీ చేతులు మారుతోందని అంటున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై :
దాని ప్రకారం ఈ మూవీని మరొక ప్రముఖ టాలీవుడ్ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తీసుకుంటున్నారని, ఇకపై వారి నుండి మూవీకి సంబంధించి అప్ డేట్స్ రానున్నాయని టాక్.
అయితే దీని పై అతి త్వరలో మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
కాగా కొద్దిసేపటి క్రితం ఈ విషయమై ఓజి మేకర్స్ స్వయంగా తమ సోషల్ మీడియా ప్రొఫైస్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
నిజానికి తమ అభిమాన కథానాయకుడి మూవీ ఓజి చేతులు మారుతోంది అనే అంశంలో ఎటువంటి వాస్తవం లేదని వారు తెలిపారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయిందని, అతి త్వరలో మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్ డేట్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
మొత్తంగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
మరి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.