Sridivya Birthday Special :
చైల్డ్ యాక్టరస్ గా నేషనల్ అవార్డు
మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు, అలాంటి అరుదైన ఆణిముత్యాలలో ఒకరు శ్రీ దివ్య, తన ముఖం చూడగానే తెలుగుతనం ఉట్టిపడుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని హనుమాన్ జంక్షన్ సినిమాతో మొదలు పెట్టి, యువరాజు, వీడే సినిమాల్లో నటించారు, భారతి అనే సినిమాతో చిన్నతనంలోనే తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుని, బెస్ట్ చైల్డ్ యాక్టరస్ గా నేషనల్ అవార్డ్ను అందుకున్నారు..
రవి బాబు దర్శకత్వం వహించిన మనసారా చిత్రంతో హీరోయిన్ డెబ్యు ఇచ్చి, మొదటి సినిమాలోనే తను చేసిన మలయాళ అమ్మాయి పాత్రకు చాలా మంది అసలు శ్రీ దివ్య తెలుగు అమ్మాయా? లేక మలయాళం అమ్మాయా? అనుకున్నారు.ఆ సక్సెస్స్ వచ్చాకా తొందర పడకుండా రెండేళ్ళు ఎదురు చూసి తనకు సరిపడా పాత్రని బస్ స్టాప్ చిత్రం ద్వారా ఎంచుకుని, శైలజ పాత్రలో కూడా అందరిని మెప్పించారు. తరవాత తమిళ్ సెన్సేషనల్ సినిమా ‘వర్త పదాతా వాలిబర్ సంఘం’ సినిమాలో లతా పాండి పాత్రలో నటన తమిళ ప్రేక్షకుల గుండెల్లో శ్రీ దివ్యని పెట్టుకునేలా చేసింది.
పేరుకు తెలుగు అమ్మాయి అయినప్పటికీ అప్పటి నుండి వరసగా తమిళ్ సినిమాలో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా వరుసగా 4 సినిమాలు తమిళ్ లో చేశారు. తెలుగు సినిమాలో అవకాశాలు వచ్చినా కూడా డేట్స్ అడ్జుస్ట్ చెయ్యలేనంత బిజీగా తమిళ సినిమాల్లో నటించారు.. 2015 లో కేరింత సినిమాతో మళ్ళి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎంతగానో అలరించారు, తను ఎలాంటి సబ్జక్ట్స్ ను ఎంచుకుంటారో కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.
తెలుగు తన మాతృ భాష అయిఅప్పటికీ కూడా తమిళ్ సినిమా తనని సొంత బిడ్డ లా ఆదరించి దశాబ్ద కాలంగా వినూత్న పాత్రలను ఇస్తూ ఒక స్థాయిలో కూర్చో పెట్టింది. ఈ తెలుగింటి ఆడపడుచు పుట్టినరోజు సందర్భంగా శ్రీ దివ్యకి అనేక మంచి సినిమాలో తమిళ్ తో పాటు తెలుగులో కూడా చెయ్యాలని కోరుకుందాం.
Also Read This Article : టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా ప్రారంభం…