Devara :
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర.
ఈ భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు.
ఇక రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న దేవర మూవీ ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి హైప్ అయితే ఏర్పరిచింది.
ఇక ఈ మూవీని రెండు భాగాలుగా భారీగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.
దేవర మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుందని, ప్రస్తుతం మూవీ కి సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోందని
ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఈ మూవీని ఖర్చు విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం అని, అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునేలా
అలరించే కథ, కథనాలతో దర్శకుడు కొరటాల శివ దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నటు చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.
ఇక దేవర ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు మేకర్స్.
దానితో ఒక్కసారిగా అందరిలో గ్లింప్స్ పై ఎంతో ఆసక్తి ఏర్పడింది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం దేవర గ్లింప్స్ మొత్తంగా 1 ని. 28 సెకండ్స్ పాటు ఉండనుండగా
ఇందులో భారీ మాస్ యాక్షన్ సీన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్స్, స్టైల్, గ్రాండియర్ విజువల్స్, అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా సూపర్ గా కుదిరాయని చెప్తున్నారు.
మొత్తంగా అయితే జనవరి 8న విడుదల కానున్న దేవర గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేయడం ఖాయం అంటున్నారు.
ఇక దేవర మూవీకి ఫోటోగ్రఫి ని ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు అందిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళి శర్మ, అభిమన్యు సింగ్ తదితరు నటిస్తున్నారు.
అయితే ఇటీవల మెగాస్టార్ తో తెరకెక్కించిన ఆచార్యతో ఒకింత ఫెయిల్యూర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ, తప్పకుండా దేవర మూవీ రిలీజ్ అనంతరం
బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా మళ్ళి బిగ్గెస్ట్ బ్రేక్ అందుకుని లైం లైట్ లోకి రావడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?