Mani Sharma :
టాలీవుడ్ సంగీత దర్శకుల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ శకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అప్పట్లో
ఘంటసాల, ఆ తరువాత చక్రవర్తి, ఇళయరాజా, రాజ్ కోటి, కీరవాణి, ఇలా పలువురు దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరిగా ఎన్నో చిత్రాలకు
సంగీతం అందించి పలు బ్లాక్ బస్టర్ లు ఆయన సొంతం చేస్తున్నారు. తొలిసారిగా 1992లో రామ్ గోపాల్ వర్మ రాత్రి మూవీకి మ్యూజిక్ స్కోర్
కంపోజ్ చేసిన మణిశర్మ, ఆ తరువాత నాగార్జున అంతం మూవీకి కూడా స్కోర్ ని అలానే ఒక సాంగ్ ని కంపోజ్ చేసారు.
1997లో “వెంకటేష్ ప్రేమించుకుందాం రా” కి కూడా సంగీతం అందించి ఆ మూవీతో మంచి క్రేజ్ అందుకున్న మణిశర్మ, అనంతరం చిరంజీవి
నటించిన “బావగారు బాగున్నారా, చూడాలని ఉంది” సినిమాలకు అద్భుత సంగీతం కంపోజ్ చేసి ఒక్కసారిగా ఎంతో పేరు గడించారు. ఇక
అక్కడి నుండి వరుసగా అనేక అవకాశాలతో చిన్న పెద్ద స్టార్స్ అందరికీ ఎన్నో చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ని అందించి పలు సక్సెస్ లు తన ఖాతాలో
వేసుకున్నారు. అయితే కొన్నేళ్లుగా యువ సంగీత దర్శకుల రాక అనంతరం ఆయన మెల్లగా సినిమాలు తగ్గించేశారు. ఇటీవల “రామ్” హీరోగా
“పూరి జగన్నాథ్” తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్, అలానే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలకు సాంగ్స్ అందించి మళ్ళి మంచి క్రేజ్ తో లైన్లో కి వచ్చారు మణిశర్మ.

మణిశర్మ ఎమోషనల్
విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా మణిశర్మ మాట్లాడిన ఎమోషనల్ మాటలు ఎందరో ఆడియన్స్ మనసులు కదిలిస్తున్నాయి.
మన స్టార్ హీరోలు అందరితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పిన మణిశర్మ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు తరచు దేవిశ్రీప్రసాద్, థమన్ కే కాకుండా
మధ్యలో నాకు అలానే ఇతరులకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని, అయితే వారికి రెండు మూడు అవకాశాలు ఇస్తే తనకు కనీసం ఒక్కటి ఇచ్చినా చాలు అన్నారు.
అప్పుడే ఆడియన్స్ కూడా అందరి నుండి వెరైటీ మ్యూజిక్ ని ఆస్వాదించే అవకాశం ఉంటుందని అన్నారు.
నిజానికి ఎందరో స్టార్ నటులకు, అలానే చిన్న నటులకు సైతం గొప్ప గొప్ప పాటలని అలానే మరిచిపోలేని అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించిన మణిశర్మ
ఒక్కసారిగా ఈ విధంగా అర్దించడం నిజంగా తామందరికీ ఎంతో బాధగా ఉందని, నిజానికి మన నటులు
అందరూ కూడా గతంలో ఆయనతో చేసిన పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించిన విషయం ఎప్పటికీ మర్చిపోకూడదని,
అందుకే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మణిశర్మకి మళ్ళి అవకాశాలు ఇవ్వాలని కోరుతూ పలువురు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మణిశర్మ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బు మొత్తం కూడా కొన్ని కారణాల రీత్యా ఇక్కడే పోగొట్టుకున్నానని,
అయితే తనకు వృత్తి పట్ల నిబద్దత ఇష్టం మాత్రం ఎప్పటికీ తగ్గవని తెలిపారు.
మనం ఉన్నా లేకున్నా మనం పనిచేసిన సినిమాలు అలానే కంపోజ్ చేసిన పాటలు ఎప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్రవేసి మనల్ని తరచు వారికి గుర్తు చేస్తుంటాయని అన్నారు.
Also Read This : ఆ అరగంట అతి కీలకమట