...

Megastar Chiranjeevi:చిరంజీవి మెగాస్టార్‌ ఊరికే అవ్వలేదు….

Megastar Chiranjeevi:

చిరంజీవి గురించి కొన్నినిజాలు…

అందరికి చిరంజీవి గురించి అన్ని తెలిసినట్లే ఉంటాయి. కళ్లకు కనిపించేవి కొన్నే, అలా కంటికి కనిపించకుండా ఏదో రకంగా తనవల్ల అవసరం ఉన్నవాళ్లు సాయం పొందాలి అనే ఆరాటం, తపన ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే నిస్సందేహంగా చిరంజీవి అని చెప్పాలి.

మాస్‌ ప్రేక్షకుల్లో మెగాస్టార్‌ చిరు అనే తన స్థానం కొన్ని దశాబ్దాలుగా పదిలంగా ఉండటానికి కారణం ఏంటి? సినిమాలు ఆడటం ఆడకపోటం అంటే ఒక ఐడియా ప్రజలందరూ మెచ్చితే ఆ సినిమా హిట్‌ లేదంటే ఒక ఐడియా ఫెయిల్‌ అయినట్లు కానీ, హీరోగా నటించిన వ్యక్తి ఫెయిల్‌ అయినట్లు కాదు.

అది మెగాస్టార్‌ అయినా కావచ్చు ఏ హీరో అయినా కావచ్చు. మంగళవారం రాత్రి చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనేక విషయాలను మీడియాతో ముచ్చటించారు చిరు.

అందులో కొంతమంది జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు సూటిగా మాట్లాడారు చిరంజీవి. ఆయన మీడియాతో మాట్లాడుతూ–‘‘వాల్తేరు వీరయ్య’ సినిమా రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనరే హెడ్డింగ్‌లు పెట్టి రాసుకోండి.

నేను నా ఫ్యాన్స్‌కోసం ఇటువంటి సినిమాలే చేస్తాను అనటం లేదు, ఇటువంటి సినిమాలు కూడా చేస్తాను అంటున్నాను.

యస్‌ ఇది పక్కా మాస్‌ సినిమానే. మైనస్‌ 8 డిగ్రీలు ఉన్న మంచులో చొక్కా మాత్రమే వేసుకుని డాన్స్‌ చేశాను.

అక్కడ మంచు కాళ్లల్లోకి వెళ్లి చాలా ఇబ్బంది పెడుతుంది. అవన్నీ కూడా తర్వాత నేను ఏదో ఒక రకంగా కాళ్లకు వేడి పెట్టుకుని సర్దుబాటు చేసుకుంటాను.

నాకు అవన్నీ ముఖ్యం కాదు, తెరపై నేను కనిపించినప్పుడు నా ఫ్యాన్స్‌ నా కోసం ఎలా ఆరటపడతారో దానిని నేను ఎంజాయ్‌ చేస్తాను అని ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు’’ చిరు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూర్‌షాట్‌ హిట్‌ అని పదేపదే చెప్పారు మెగాస్టార్‌..

ఈ ఏడాది చిరంజీవికి ఫుల్‌ ప్రమోషన్లు..

– చిరంజీవి అనే స్టార్‌ గురించి తెలుగు చిత్రపరిశ్రమే కాకుండా యావత్‌ భారతదేశం కూడా బెస్ట్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇండియన్‌ హిస్టరీ అని రోజు గుర్తుచేసుకుంటుంది.

చిరంజీవి అనే వ్యక్తి నటునిగా మెగాస్టార్‌ అయితే వ్యక్తిగా అంతకుమించి అని చిరంజీవిని దగ్గరనుండి గమనించిన ఎవరైనా చెప్తారు.

వ్యక్తిగా అంత గొప్పమనిషి చిరంజీవి. నటునిగా బ్లాక్‌బస్టర్‌ సినిమా అనే పేరును తెలుగు సినిమాకి పరిచయం చేసిందే చిరంజీవి.

– 1970, 1980, 1990ల సమయంలో పుట్టిన ఎంతోమంది తెలుగు సినిమా పరిశ్రమకు ఆకర్షితులై ఇండస్ట్రీకి వచ్చారంటే ఆ ఘనత చిరంజీవిదే.

చిరంజీవి అభిమానులు ఆయన సినిమాలు చూస్తూ పెరిగి సినిమా పరిశ్రమకి వచ్చి ఆయన అడుగుజాడల్లో నడిచి రికార్డులు తిరగరాశారు.

తర్వాత కాలంలో వారంతా దర్శకులుగా, నిర్మాతలుగా,నటులుగా మారి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

– చిరంజీవి మెగాస్టార్‌ ఊరికే అవ్వలేదు. తనను ఎవరైనా అభిమానిస్తున్నారంటే వాళ్ల యోగక్షేమాలు కనుక్కోవటమే కాకుండా తన అభిమానులకోసం ఆ రోజుల్లోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

తన సినిమా ఫంక్షన్‌లకు వారిని ఆహ్వానించటంతోపాటు తనను చూడటానికి వచ్చిన అందరితో ఓపిగ్గా ఫోటోలు దిగి దగ్గరుండి మరి వారిని సాగనంపేవారు.

మొదటినుండి ఓ రాజకీయ నాయకుడిలా ప్రజల్లో

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో చిరంజీవికి అభిమాన సంఘాలు ఉండేవంటే తన నెట్‌వర్క్‌ ఏ రేంజ్‌లో ఉండేదో ఓ సారి ఊహించుకోండి.

– అన్నింటికంటే మించి తన కుటుంబంనుండి వచ్చిన అనేకమంది హీరోలను ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. వారంతాకూడా చిరంజీవి కనుసన్నల్లోనుండే నటులుగా మారారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అంత పవర్‌ఫుల్‌గా తన కుటుంబాన్ని కాపాడే వ్యక్తే చిరంజీవి. అందుకే ఎందరు హీరోలు వచ్చిన వారందరిని మెగాహీరోలు అంటారే కానీ, మరో పేరు వినిపించరు. ఒకవేళ ఇప్పుడెవరికైనా సొంతంగా ఎదిగాము అని అనిపించినా కూడా వారి పేరు మారదు.

వారంతా మెగా హీరోలే అవుతారు.
– చిరంజీవి సినిమాస్టార్‌ అయినా కూడా మొదటినుండి ఓ రాజకీయ నాయకుడిలా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాడు.

తాను ఏనాడు సింగిల్‌గా తిరగలేదు. షూటింగ్‌లు, సినిమా ఫంక్షన్‌లు, అభిమానులు, సినిమా విడుదలలు, సక్సెస్‌లు ఇలానే తన 46ఏళ్ల సినిమా ప్రస్థానాన్ని గడుపుతున్నాడు. అందుకే భారతదేశంలోని బెస్ట్‌ అవార్డులన్నీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి..

– నటుడనేవాడు తనకు అప్పచెప్పిన పనిని నిండుమనసుతో ప్రతిరోజు కష్టపడితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కష్టపడనివాడు సినిమా పరిశ్రమను వదిలి వెళ్లిపోవాల్సిందే అంటారు మెగాస్టార్‌.

– చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయటంతోనే చిరంజీవి ఔదార్యం ఖచ్చితంగా తెలుస్తుంది. ఆపద సమయాల్లో బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా రక్తాన్ని పొంది ఎంతమంది తమ ప్రాణాల్ని కాపాడుకున్నారో కథలు కథలుగా చెప్తారు అక్కడ సాయం పొందిన దాతలు.

– 2022వ సంవత్సరం ఆయన సినిమా పరంగా ఓ సినిమా ఫ్లాప్, మరో సినిమా హిట్‌ అనిపించుకున్నాయి. అది ప్రొఫెషనల్‌గా మాత్రమే.

వ్యక్తిగతంగా చిరు తన కొడుకు రామ్‌చరణ్‌ తండ్రి కాబోతుండటంతో తాతగా ప్రమోషన్‌ సాధించారు.

అలాగే 2022వ సంవత్సరానికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అనే అవార్డును 53వ ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో భాగంగా అవార్డును చిరంజీవికి అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడిగారు కూడా చిరంజీవి ఘనతను గుర్తు చేస్తూ, సరైన వ్యక్తే ఈ అవార్డు అందుకోవటంతో అవార్డుకే మరింత పేరొచ్చింది అన్నారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్నారు చిరు. ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ బెస్ట్‌ విషెశ్‌ను తెలియచేస్తుంది ‘కెవ్వుకేక. కామ్‌’ మరియు ‘టైమ్స్‌ ఆఫ్‌ తెలుగు’ యూట్యూబ్‌ ఛానల్‌.

                                                                                                                         శివమల్లాల

 

Senior Actor Ravi Varma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.