Prabhas Raju : ఈ రోజు ప్రభాస్‌ పుట్టినరోజా?

Prabhas Raju:

తెలుగు సినిమా స్టామినా ఇది అని చెప్పిన ప్రభాస్‌కి నవంబర్‌ 11 ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? ప్రభాస్‌ పుట్టినరోజా? కాదే,

ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23కదా! అనుకుంటున్నారా. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఈ డేట్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసం లేదు. కానీ, రెగ్యులర్‌ సినిమా లవర్‌కి మాత్రం చెప్పాల్సిందే.

సరిగ్గా 20 ఏళ్ల క్రిందట ఇదే రోజు నవంబర్‌ 11న ప్రభాస్‌ హీరోగా ‘‘ఈశ్వర్‌’’ అనే చిత్రంలో నటించి వెండితెరపై తనబొమ్మను తాను చూసుకున్న రోజిదే. అప్పటికే ప్రభాస్‌కి బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

 

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసునిగా మరో హీరో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయవుతుండటంతో ఆయన అభిమానులంతా ఈ చిన్న రాజు ప్రభాస్‌కి ఫ్యాన్స్‌గా మారిపోయారు.

మొదటి సినిమా విడుదలరోజున ప్రభాస్‌ను చూసిన వాళ్లంతా ఒడ్డు, పొడుగు బాగానే ఉన్నాడు. పెదనాన్న కృష్ణంరాజులా ఇండస్ట్రీలో మరో మంచి హీరోలా ఉండిపోతాడు అనుకున్నారంతా.

కానీ, కథలో చిన్న ట్విస్ట్‌ ఏంటంటే పెదనాన్న తెలుగు ప్రేక్షకులకే పరిమితమైపోయారు.

మొదటి పాన్‌ఇండియా స్టార్‌

ప్రభాస్‌ మాత్రం ‘బాహుబలి’ సినిమాలో కొండపైనుండి ఓ నది పారుతుంటుంది. అందరూ నదిని చూసి అందులో నీళ్లను ఆస్వాదిస్తే శివుని పాత్రలో నటించిన ప్రభాస్‌ మాత్రం ఆ నీళ్లు ఎక్కడినుండి వస్తున్నాయి.

ఎలాగైనా అసాధ్యమైనా ఆ కొండను ఎక్కేయాలని తాపత్రయ పడుతుంటాడు. చివరికి తాను అసాధ్యమనుకున్న కొండను ఎక్కినట్టే, తెలుగు సినిమా పరిశ్రమకు దోసకాయంత మార్కెట్‌ ఉంటే దాన్ని గుమ్మాడికాయగా మలిచింది మాత్రం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి నిస్సందేహంగా చెప్పొచ్చు.

రాజమౌళి ఎంత గొప్పగా చెప్పినా, తీసినా ఆ ఫీట్‌ను భుజాలపై ఎత్తుకుని మోసే మొనగాడు సరైనోడు అయ్యుండాలి.

రాజమౌళి హీరో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టాలి అంటే అవును తన హీరో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేశాడు అని ప్రేక్షకులు చెప్పుకోవాలంటే సరైన ఫిజిక్‌తో ఉన్న నిఖార్సయిన మనిషి ఉండాలి.

‘బాహుబలి’లో రాజుని గమనిస్తే రాజంటే ఇలా ఉంటాడేమో అన్నట్లుగా ప్రభాస్‌లాంటి కంటెంట్‌ ఉన్న కటౌట్‌ గట్టిగా నిల్చోబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు అంత గుర్తింపు లభించింది.

ఏ వ్యక్త్యనా ఏదైనా సాధించాడు అని చెప్పుకోవాలంటే తాను దాటొచ్చిన ప్రయాణం గురించి చెప్పుకోవాలి.

20 ఏళ్లలో ప్రభాస్‌ చేసిన సినిమాల ప్రయాణాన్ని ఓసారి గమనిస్తే తాను ఏం సాదించాడో, ఎంత సాదించాడో ప్రత్యేకంగా మనం ఈరోజు చెప్పుకోనవసరం లేదు.

ప్రభాస్‌ ఈ 20 ఏళ్లలో వందేళ్ల సినిమా చరిత్రలో ఉన్న లెక్కలన్నిటిని కెలికేశాడు. అది ప్రభాస్‌ స్టామినా. మరో 20 ఏళ్లకు సరిపడా తనకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇదే ఒక ఆర్టిస్ట్‌ జర్నీ అంటే.

ప్రస్తుతం ఎన్ని పాన్‌ ఇండియా సినిమాలు వచ్చినా, వస్తున్నా కూడా మొదటి పాన్‌ఇండియా స్టార్‌ మాత్రం ప్రభాసే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల ప్రభాస్‌ ప్రస్థానంలో ఎందరికో థ్యాంక్స్‌ చెప్పుకోవాలి.

వారిలో ముందుగా పెదనాన్న కృష్ణంరాజు, తన తండ్రి సూర్యనారాయణ రాజులతో పాటు తనని రాజుగా ఈ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

Prabhas
Prabhas

ఈశ్వర్‌ ప్రభంజనం

తనకు తొలి రోజులనుండి ఎంతో అండగా తనతో పాటే ఉన్న ఫ్యాన్స్‌కు తానేమిచ్చిన రుణం తీర్చుకోలేడు ప్రభాస్‌.

ఇక ‘‘ఈశ్వర్‌’’ సినిమా టాపిక్‌కి వస్తే ఆ సినిమా ఒకేచోట గుంటూరులో వందరోజులు ప్రదర్శించబడింది.

ఆ వందరోజుల సభకు దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా హాజరై ఏమన్నారంటే‘‘ గుంటూరులో ఈ వందరోజుల వేడుక జరగటానికి

ముఖ్యకారణం కృష్ణంరాజు అంటే ప్రాణమిచ్చే అభిమాని శాస్త్రి గుంటూరులో ఉండటమే.  అందుకే ఈ సభ గుంటూరులో జరగటమే కరెక్ట్‌ అని నేను గుంటూరు వచ్చాను.

కృష్ణంరాజు 40 ఏళ్లపాటు తెలుగు సినిమా పరిశ్రమను ఏలాడు.

మరో 40 ఏళ్లపాటు పెద్ద స్టార్‌ హీరోగా ప్రభాస్‌ ఎదిగి కృష్ణంరాజు కీర్తిని ముందుకు తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని వందరోజుల వేడుకలో దాసరి నారాయణరావు మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ రోజు శాస్త్రి అనే అభిమాని తన దగ్గరున్న ‘‘ఈశ్వర్‌’’ సినిమా క్లిప్పింగులను ఆ రోజున ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించిన పత్రికా కథనాలను ‘‘కెవ్వుకేక.కామ్‌’’ కు ప్రత్యేకంగా పంపారు.

మరో 20 ఏళ్లు మీరు లానే పాన్‌ఇండియా స్టార్‌గా కొనసాగాలని శుభాకాంక్షలు చెప్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్సంతా. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ ప్రభాస్‌….

శివమల్లాల

Also Read This : ఇమ్రాన్ హష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *