మెగాస్టార్ చిరంజీవిగారు ఆబ్లెక్షన్ మై లార్డ్ ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజిన‌ల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ఈ రోజు ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు హీరో శ్రీకాంత్, పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ కిషోర్ మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చాలా చూసే వాడిని. ఈ సినిమా చాలా సీరియస్ డ్రామా. ఈ నెలలోనే స్టార్ట్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్. టీం అంతా చాలా కష్టపడి పని చేశారు అన్నారు.

▶️ Event Playlist: https://www.youtube.com/watch?v=AZGwo0qIdkA&list=PLB-hwwKWUBfQ

జెమినీ సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సీరియస్ డ్రామాను మీ ముందుకు తీసుకురావడం పెద్ద టాస్క్. ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ టీం ఇందులో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. నాకు మంచి పాత్ర ఇచ్చిన జీ తెలుగు టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర, షూటింగ్ చేస్తున్నపుడు చాలా నేర్చుకున్నా. షూటింగ్ సమయంలో శ్రీకాంత్ అన్నను చూసి చాలా నేర్చుకున్నా. డే అండ్ నైట్ కష్టపడి పని చేసిన శ్రీకాంత్ అన్నను చూసి ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా అన్నారు. సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ విషయంలో నాకు చాలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *