పూరికి 25 ఏళ్లు..

టైటిల్ చూడగానే దర్శకుడు పూరి జగన్నాథ్‌కి 25 ఏళ్లు ఏంటి అనిపిస్తోందా? ఆ కథేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఎన్నో సంచనాలకు కేరాఫ్ అయిన ఆయన తొలి సినిమాకు 25 ఏళ్లు దాని కథేంటో తెలుసుకుందాం.

మెగాస్టార్‌ క్లాప్‌తో సినిమా స్టార్ట్‌.. ఆ ఒక్క సినిమా ఎన్నో జీవితాలకు కేరాఫ్‌ అడ్రస్‌… పవన్‌కళ్యాణ్‌కు ట్రెండింగ్‌ డైలాగ్స్‌ను అందించిన చిత్రమిది.. ఈ ఒక్క సినిమాతో వచ్చిన స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌తో ఎన్నో కథలు పురుడు పోసుకుని సంచలనాలు సృష్టించాయి. ఆ సినిమా పేరు బద్రి… ఆ దర్శకుని పేరు పూరి జగన్నాథ్.  పవన్, రేణూల పరిచయం పరిణయంగా మారింది ‘బద్రి’తోనే… పూరి దర్శకునిగా స్టారయ్యింది ఇక్కడే.  ప్రకాశ్‌రాజ్‌ నెంబర్‌వన్‌ నటునిగా, టాప్‌ విలన్‌గా ప్రూవ్‌ అయ్యింది ఈ ‘బద్రి’ సెట్‌లోనే…

రమణగోగుల పేరు మారుమోగింది ఇక్కడే… పాటలన్నీ సంగీత దర్శకుడే పాడటం ఈ సినిమాలో చూస్తాం.. టి.త్రివిక్రమరావు నిర్మాణంలో తెరకెక్కిన ‘బద్రి’.. ఆ రోజుల్లో 18 కోట్లు షేర్‌ రావటం చాలా పెద్ద విషయం.. ఈ సినిమా ఇచ్చిన ధైర్యమే తర్వాత కాలంలో పూరి టైటిల్‌ కార్డు మారింది….వైష్ణో అకాడమి అనే సంస్థ పుట్టింది… ఈ సినిమా తర్వాత మాస్‌కి కొత్తగా ఓ భాషోచ్చింది. కథ కథనం మాటలు నిర్మాత దర్శకుడు..పూరి జగన్నాథ్‌.. అనే కార్డు పడేలా చేసింది. ఇన్ని విశేషాలకు నెలవైన ‘బద్రి’ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ Tagtelugu.com శుభాకాంక్షలు.

శివమల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *