TS SSC Results : తెలంగాణలో పదో తరగతిలో బాలికలదే పైచేయి

TS SSC Results :

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాసిన ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 89.41శాతం ఉత్తీర్ణత సాధించగా .. బాలికలు 92శాతం ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణలో 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు నమోదయ్యాయి. కాగా, నిర్మల్ 99.06 శాతంతో ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది.

వికారాబాద్‌ అత్యల్పంగా 66శాతం ఫలితాలను సాధించినట్టు బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇక.. 8883 మంది 10జీపీఏ సాధించినట్టు తెలిపారు.

తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఓవరాల్‌గా ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.

ఇక జూన్ 3 నుంచి 13వరకు ఉదయం 9.30 నుంచి 12.30వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు.

ఉత్తీర్ణత సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. ఫలితాలతో కలత చెందొద్దని సూచించారు.

Also Read This Article : ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్

Hyper Aadi Exclusive Interview Interview
Hyper Aadi Exclusive Interview Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *