Nandamuri Taraka Ramarao :
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట కుటుంబ వారసత్వంలోకి మరో యన్టీఆర్ వచ్చేస్తున్నారు.
మరో యన్టీఆర్ ఏంటి? ఆల్‌రెడి జూనియర్ యన్టీఆర్ ఉన్నాడుగా అనుకునుంటున్నారేమో…
సీనియర్ యన్టీఆర్ మనవడు హరికృష్ణ కుమారుడు జూనియర్ యన్టీఆర్‌గా యంగ్‌టైగర్ అందరికి సుపరిచితమే.
మరి ఈ యన్టీఆర్ ఎవరు? ఈ ఎన్టీఆర్ ఎవరంటే నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు స్వర్గీయ జానకిరామ్ కుమారుడే ఈ యన్టీఆర్.
యన్టీఆర్ కుటుంబంలో నుండి వస్తున్న మునిమనవడు ఇతను.
టాలెంటెడ్ దర్శకుడు వైవియస్.చౌదరి దర్శకత్వంలో యలమంచిలి గీత నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని మీడియా వారికి తెలియచేశారు.
ఈరోజు యన్టీఆర్ దర్శనం అంటూ జరిగిన హీరో మొదటిలుక్‌ను విడుదలచేశారు.
దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత సి. అశ్వనీధత్ చేతులమీదుగా ఈ నూతన హీరో లాంచ్ జరగటం విశేషం.
నూతన హీరో లుక్‌ను వీడియో రూపంలో చూసినవారందరూ మంచి హీరో మెటీరియల్ అని కొనియాడారు.
మరో యన్టీఆర్ రావటంతో రాబోయో రోజుల్లో యన్టీఆర్‌ల గురించి కన్‌ఫ్యూజన్ వచ్చే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తారో భవిష్యత్తులో చూడాలి మరి…
శివమల్లాల
Also Read This : బాల చంద్రులకు సూటి ప్రశ్నలు