YS Sharmila politics :
షర్మిలా అడుతున్న చదరంగలో తాను ఏ పొజిషన్లో ఉందో ఆమెకు తెలుసా?
అది రాజకీయం కాబట్టి…ఈ ఒక్క లైన్‌తోనే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది. ఎస్ మీరు ఊహించిన ‘మనీ–షి’ మీ కళ్లముందుకు వచ్చిందని నాకు అర్ధం అయ్యింది.
ఇప్పుడు ఆ గొప్ప మనిషి గురించి ఎందుకులే అనుకుంటే ఈ టాపిక్‌కి రైటప్‌క అర్థమే లేదు. కానీ ఆమె ఏమి మాట్లాడినా సంచలనం, అద్భుతం, సూపరో సూపర్, బంపరో బంపర్ అని ఆమె మాత్రం అనుకుంటుంటారు కాబట్టి.
ఆమెవరో కాదు, రాజశేఖర్ రెడ్డి ముద్దులబిడ్డ తెలంగాణా వైయస్‌ఆర్‌టిపి అధి నాయకురాలు షర్మిలా.
ఈమెను ఈమె కాన్ఫిడెంట్ లెవల్స్ చూస్తుంటే కొన్ని ఫేమస్ సామెతలు కళ్ల ముందుకు వచ్చి డాన్స్ చేస్తుంటాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఏ సామెతకు కరెక్టుగా యాప్ట్ అంటే ‘‘కూరలో కరివేపాకు….’’ అనే సామెతకు ఆమె యాప్ట్ అని సదరు ఆంధ్ర చెయ్యి గుర్తు లీడర్ షర్మిలాగారు తప్పనిసరిగా గుర్తుకు వస్తారు.
ప్రతి కూరలో కరివేపాకు ఖచ్చితంగా ఉంటుంది. తినేటప్పుడు కరిపేపాకును ఎంత చక్కగా సైడ్ చేస్తామో ఆమెకు తెలిస్తే బావుంటుంది.
మొన్నీమధ్యనే ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నేను పోటీ చేయకపోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఆధికారంలోకి వచ్చింది అనగానే సొంత పార్టీ పెద్దల జరంతా గుస్సయ్యారు.
ఆమె మాట్లాడుతుంటే టీవీలు చూస్తున్న వార్త ప్రేక్షకులంతా నోటితో నవ్వలేదు ( నవ్వాలనుకోలేదు, కొత్తగా నవ్వటానికఏముందిలే కానీ అనుకుని సైలెంట్‌గా ఉండిపోయారు).
కానీ, ఒక ఇంట్లో అన్నా చెల్లెళ్ల మధ్య వేరు కుంపటి పెట్టి ఆ కుంపట్లో రకారకాల వంటలు చేయాలనుకునే డిల్లీలోని పెద్ద తలకాయలు ఇప్పుడిప్పుడే చదరంగంలో పావులు కదుపుతున్నారు.
రావమ్మ షర్మిలమ్మా రావమ్మ ..
అమాయకురాలైన ఆహల్య తాను ఆటడుతున్నాను అనుకుంటుంది కానీ, ఆటలో ఆమె ఏ పొజిషన్‌లో ఉంటుందో అస్సలు తెలియని, తెలివిలేని అమాయకురాలేమో అని అందరూ కంగారు పడుతున్నారు.
చదరంగం ఆటలో డిల్లీ పెద్దలు షర్మిలను పెట్టి ఆటలో నీ పార్టిసిపేషన్ ఉంటుంది అన్నారు. ఆ మాట విన్న షర్మిలాజీ…అబ్బ నిజంగా నేను చాలా పెద్ద ప్లేయర్‌ని అనుకుని రంగంలోకి దిగారు.
చాలా అద్భుతమైన అవకాశం ఈ గేమ్ ఆడటానికి అనుకుంటుంది కానీ, రాజుని పోరాడాలంటే చదరంగంలో తాను ఏ పొజిషన్‌లో పోరాడుతుందో ఖచ్చితంగా తెలుసుకుని ముందడుగు వేస్తే బావుంటుంది.
తెలంగాణాలో వైయస్సార్‌టీపి పార్టీని పెడితే ఏదో తండ్రిని గుర్తు చేసుకుంటూ పార్టీ పెట్టుకుందిలే అమాయకమైన మనిషి అనుకున్నారంతా.
రేపటిరోజున ఆమె వల్ల జగన్‌గాని, జగన్ పార్టీకి గాని నష్టం వచ్చే పరిస్థితి ఉండదు అని పొలిటికల్‌గా కొంచెం నాలెడ్ట్ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది.
తెలంగాణాలో షర్మిలాని కామెడిగా తీసుకున్నారు కానీ, ఆంధ్రలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ట్రోలర్స్‌కి, మీమర్స్‌కి చేతినిండా పని కల్సించే పరిస్థితి అతి కొద్దిదూరంలోనే ఉందని అందరికి అర్థం అవుతుంది.
షర్మిలా ఏపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అనగానే అధికార పార్టీ నాయకులకే ఆమెను ఎలా ఎదుర్కోవాలి? ఎలా మాట్లాడితే ఏమవుతుందో అనే మీమాంసలో అందరూ ఉన్నారు.
చూడాలి! అన్న ఆదేశిస్తే చెల్లిని ఎలా ఎదుర్కోవాలి అనే టాగ్‌లైన్‌తో వచ్చే సందేశాలకోసం ప్రతి ఒక్క నాయకుడు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మీడియా, ప్రజలు కూడా ఓ కన్నేసి ఆంధ్ర రాజకీయాల వైపు ఐమూలగా చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.
ఆంధ్రలో జరిగే చెస్ టోర్నమెంట్‌లో విజేతలవుతారో, పరాజితులెవరో ఎవరు డ్రాగా ముగించుకుంటారో ఎవరి ఆట ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే….
.‘‘రావమ్మ షర్మిలమ్మా రావమ్మ …’’ అని మీడియా ఆమెకు హారతి పట్టి ఎంటర్‌టైన్ చేయటానికి మూడు మీమ్‌లు ఆరు ట్రోల్స్‌తో రెడిగా ఉంది.
గెట్ రెడి ఫర్ ది న్యూ ఎరా ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ ఏపి పాలిటిక్స్….
శివమల్లాల
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?