YS Sharmila in AP Politics:వైఎస్ షర్మిల అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.
ఏపీ సీఎం జగన్ సోదరి మాత్రమే అని వైపీపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెకు పీసీసీ చీఫ్ పదవి
ఇచ్చింది ఈ అర్హతతోనే అని కూడా చెబుతున్నారు. అంతకుమించి ఆమెకు ప్రజల్లో ఉన్న గుర్తింపు గానీ, ఆదరణ గానీ ఏమీ
లేవని చెబుతున్నారు. అంతేకాదు.. షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాష్ట్రంలో ఎక్కడినుంచి చేసినా.. డిపాజిట్ కూడా రాదంటున్నారు.
ఇది నిజమేనా? డిపాజిట్ తెచ్చుకునే స్థాయి కూడా ఆమెకు లేదా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి దాదాపు ఇవే విశ్లేషణలు వస్తున్నాయి.
జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరిగా షర్మిల పాదయాత్ర చేశారు. జగనన్న బాణాన్ని అని చెప్పుకొన్నారు. జగనన్న జైలునుంచి వచ్చేదాకా
పార్టీని, కాపాడితే.. ఆ తరువాత అంతా ఆయన చూసుకుంటారని చెప్పారు. అన్నట్లుగానే.. పార్టీ శ్రేణులను కాపాడారు. కానీ, జగన్
బయటికి రావడం, రాష్ట్రం విడిపోవడం, 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేయడం, ఈ పరిణామాలన్నీ జరిగాయి. కానీ, ఏ ఒక్కరోజు కూడా షర్మిల పేరు ఈ పరిణామాల్లో వినిపించలేదు.
కనీసం అన్న ముఖ్యమంత్రి అయ్యాకనైనా తనకు సముచిత స్థానం కల్పిస్తారని షర్మిల భావించారేమో తెలియదు.
కానీ, ఎన్నాళ్లు ఓపిక పట్టినా ఎటువంటి న్యాయం జరగకపోగా, చివరకు ఆస్తిలో భాగం కూడా ఇవ్వనని జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో లాభం లేదనుకొని తానే స్వయంగా రాజకీయాల్లోకి దిగారు.
తన తండ్రి వైఎస్సార్ సేవలు, ఆయన పాలన తెలంగాణాలో కూడా ఉన్నాయని, అందువల్ల తన తండ్రి పాలన తెస్తానటూ
మూడు వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్
మొత్తం 119 సీట్లకు అభ్యర్ధులను పెడతాను అన్నారు. ఆఖరుకు తాను కూడా పాలేరులో పోటీ చేయకుండా చాప చుట్టేశారు.
మరి షర్మిలను ఎందుకు కాంగ్రెస్ ఏపీలో తీసుకుని వచ్చింది అంటే ఆమె వల్ల వైసీపీ ఓట్లలో చీలిక కోసం అన్నది రాజకీయం
తెలిసిన వారికి అందరికీ అర్థమయ్యే విషయమే. ఇప్పుడు షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్. మరో రెండు నెలలలో ఎన్నికలు
జరగనున్నాయి. షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ పోటీ చేసినా ఆమె గెలుస్తారా అన్నది మరో ప్రశ్న.
గెలుపు సంగతి పక్కన పెడితే డిపాజిట్లు వస్తాయా అన్నది మూడో ప్రశ్న. ఇవన్నీ ఎందుకు అంటే షర్మిలతో పాటు ఆమె ఉన్న
కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో ఇబ్బందుల్లో ఉంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ ని జాకీలు పెట్టి లేపినా ఈ రెండు నెలలలో
లేచి కూర్చునే సీన్ అయితే లేదు. ఇక మొత్తం 175 సీట్లకు అభ్యర్ధులు కాంగ్రెస్ కి దొరుకుతారా అన్నది కూడా కీలకమైన ప్రశ్న.
ఎందుకంటే 2019లో జనసేన కూడా మొత్తం సీట్లకు పోటీ చేయలేకపోయింది. 137కే ఆ పార్టీ పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చినవి ఏడో ఎనిమిదో.
పవన్ కళ్యాణ్ అంటే సినీ గ్లామర్ ఉంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నారు. అయినా ఆయన పార్టీ పెర్ఫార్మెన్స్ అలా ఉంది.
అయినా.. స్వయంగా పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. ఇపుడు షర్మిల గెలవడం సాధ్యపడుతుందా అన్నది ప్రశ్న.
ఏపీలో ఆమె ఎక్కడ పోటీ చేసినా రెండు లక్షల ఓట్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేల ఓట్లు అయినా ఆమె తెచ్చుకోవడం
జరుగుతుందా అన్నది మరో ప్రశ్న. వైసీపీ నేతలైతే.. షర్మిలకు ఎక్కడా కూడా డిపాజిట్లు రావు అని ముందే చెప్పేస్తున్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీకే ఏపీలో ఎక్కడా డిపాజిట్లు వచ్చే పరిస్థితే లేదని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని షర్మిల ఎలా అధిగమిస్తారో, తన
బలాన్ని ఏ మేరకు చాటుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?