మహాకాళేశ్వర ఆలయంలో యశ్ ప్రత్యేక పూజలు.. త్వరలోనే ‘రామాయణం’ సెట్స్‌లోకి..

సినిమాలు, సెంటిమెంట్ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇప్పుడే కాదు.. గతంలోనూ సినిమాల్లో సెంటిమెంట్ చాలా కీలకం. అయితే కొందరు మాత్రం సెంటిమెంటును పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం ‘రామాయణం’ అనే చిత్రం బాలీవుడ్‌లో రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి నటిస్తోంది. రావణుడి పాత్రలో హీరో యశ్ నటిస్తున్నాడు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత అసలు యశ్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడనేది అభిమానులకు ఆసక్తిగా ఉండేది. ఈ క్రమంలోనే ఒకవైపు ‘టాక్సిక్’ను లైన్‌లో పెట్టి.. ఇప్పుడు ‘రామాయణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తేలిపోయింది.

‘రామాయణం’ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఈ సినిమాకు సాంకేతికతను జోడించి మరీ హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమాను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘దంగ‌ల్‌’ ఫేమ్ నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. త‌న స్నేహితుడితో క‌లిసి య‌శ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో బాబిడియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి భాగం షూటింగ్ దాదాపుగా ఎండింగ్‌కు చేరుకుంది. ఇక కీలక ఘట్టాల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే యశ్ సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే సెంటిమెంటును అనుసరిస్తూ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో యశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *