క్రైమ్, థ్రిల్లర్‌కు మైథలాజికల్ టచ్ ఇచ్చి రూపొందిస్తున్న చిత్రమే ‘యముడు’. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ‘యముడు’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఏడాది వందల చిత్రాలు వస్తుంటాయి. అందులో కొంత మందికి మాత్రమే సక్సెస్ వస్తుంది. చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘యముడు’ సినిమాను తీశారు. మొదటి చిత్రాన్నే ఇంత ప్రయోగాత్మాకంగా తీయడం గొప్ప విషయం’’ అని అన్నారు.
జగదీష్ ఆమంచి మాట్లాడుతూ .. ‘‘మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి.. సినిమా మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఈ రోజు ‘యముడు’ సినిమాతో ఇక్కడి వరకు వచ్చాను. ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు. శ్రావణి శెట్టి మాట్లాడుతూ .. ‘మన జీవితంలో జరిగే ఘటనల్నే, చేసే తప్పుల్నే ఇందులో చూపించబోతోన్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. శివ మంచి స్క్రీన్ ప్లేని రాశారు. జగదీష్ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆయన ముందుకు వెళ్తూనే ఉంటారు’ అని అన్నారు.
ఆకాష్ మాట్లాడుతూ .. ‘జగదీష్ గారు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. నా ఈ ప్రయాణంలో శివ ఎప్పుడూ అండగా నిలిచారు. భవానీ రాకేష్ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. భవానీ రాకేష్ మాట్లాడుతూ .. ‘మా ‘యముడు’ సినిమాకు అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో శివ నాతో మూడేళ్లుగా ప్రయాణిస్తూనే ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. ఈ మూవీలోని పాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి’ అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల