ధర్శకుడు రాజమౌళి వేసిన రాచమార్గం తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని అమాంతం పెంచేసింది.
ఆయన వేసిన బాటలో తెలుగు సినిమా బాలీవుడ్‌లోకి సగర్వంగా ఎంటరై తెలుగు నటుల, దర్శకుల స్టామినాను ప్రూవ్ చేస్తున్నాయి.
ఉదాహరణకు అల్లుఅర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం ‘పుష్ప–2 ది రూల్’.
సరిగ్గా 25 రోజుల్లో ఈ చిత్రం 1760కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి ఫాస్టెస్ట్ కలెక్షన్లలో నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
ఈ సినిమా ప్రీమియర్‌రోజు హైదరాబాద్‌లో తొక్కిసలాట జరగకపోయుంటే, రేవతి అనే యువతి చనిపోకపోతే ‘పుష్ప’ టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయేది.
అలాగే మెగా ఫ్యాన్స్– అల్లు ఫ్యాన్స్ మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న నెంబర్స్‌ను దక్కించుకోకపోవటానికి ప్రధాన కారణం అని చెప్పాలి.
నార్త్‌లో ఇటువంటి రాజకీయాలు, రాజకీయ లెక్కలు ఏమిలేకుండా సినిమాని సినిమాలా చూడటంతో అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘పుష్ప’.
నేపాల్‌లాంటి ప్లేస్‌లో కూడా ఈ సినిమా దాదాపు 25 కోట్లను రాబట్టిదంటే సుకుమార్, అల్లుఅర్జున్‌లు తెలుగు సినిమాలు చేయకపోయినా పరవాలేదు
నార్త్‌లో పెద్ద దుకాణమే ఓపెన్ చేయొచ్చు అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా బాక్సాఫీస్ లెక్కలు చెపుతున్నాయి.
చూడాలి మరి వచ్చే ఏడాదిలో సుకుమార్, బన్నీలు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఏదేమైనా ఇటువంటి బాక్సాఫీస్ నెంబర్స్‌ను రాబట్టిన ‘పుష్ప’ టీమ్‌కి ముఖ్యంగా సుకుమార్, అల్లు అర్జున్, రష్మికా మందన్నకు విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తారు సినిమా లవర్స్.
శివమల్లాల
Also Read This : టాలీవుడ్ స్లెడ్జింగ్ ప్రొడ్యూసర్ సితార నాగవంశీ…