2025 Sankranthi Movies :
సంక్రాంతికి వచ్చి గేమ్‌ఛేంజర్‌గా నిలవటానికి రెడీ అయిన ‘దిల్’రాజు……
బాలకృష్ణ, వెంకటేశ్, రామ్‌చరణ్ ఈసారి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
కాకపోతే వీరిలో ఎవరు నిలుస్తారు? ఎవరు గెలుస్తారు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్.
ముఖ్యంగా బాలయ్య బాబు వరుస హిట్లతో జోరు మీదున్నాడు.
2023లో దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతో ‘భగవంత్‌కేసరి’ సినిమాకి దర్శకత్వం వహించి ఆ సినిమా విజయంతో దర్శకునిగా భారీ విజయాన్ని తన ఎకౌంట్‌లోకి వేసుకున్నారు అనిల్.
మరలా ఇప్పుడు వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ నవ్వులు పూయించటానికి రెడీ అయ్యారు అనిల్.
దర్శకుడు అనిల్ కత్తికి రెండువైపులా పదునుంటుంది. ఆయన పూర్తి హాస్య చిత్రాన్ని తీయగలరు, అలాగే మాస్ చిత్రాన్ని తెరకెక్కించి శహభాష్ అనిపించుకోగలడు.
దర్శకుడు బాబి రెండేళ్ల క్రితం సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద చిరంజీవి సత్తాను మరోసారి చాటి మాస్ సినిమాల్లో చిరంజీవి స్టామినా ఏంటో నిరూపించారు.
ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణని ‘డాకు మహరాజ్’గా మనందరికి పరిచయం చేయనున్నారు.
ఈ రెండు సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
అలాగే గత మూడేళ్ల క్రితం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చిన గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్‌ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నారు.
మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది ప్రేక్షకలోకం.
దానికి కారణం ఏంటంటే క్రియేటివ్ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మాతగా గతంలో ఇంత పెద్ద బడ్జెట్‌తో ఏ సినిమా తెరకెక్కలేదు.
అదొక కారణం అయితే మరో కారణం శంకర్ గత 30 సంవత్సరాలుగా దర్శకునిగా ప్రేక్షకులవద్ద నీరాజనాలు అందుకుంటున్న కూడా అవన్నీకూడా తమిళ సినిమాలే.
ఈ 30ఏళ్లలో మొదటిసారి శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో అందరికి ‘గేమ్‌ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకే ఈ సినిమా అందరికంటే ముందుగా జనవరి10వ తేదినే విడుదల అవుతుంది.
ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు సంక్రాంతి కరెక్ట్ సమయం.
అందుకే ‘దిల్’ రాజు ఈ సంక్రాంతికి తన నిర్మాణంలో వస్తున్న ‘గేమ్‌ఛేంజర్’,‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండు చిత్రాలను విడుదల చేయనున్నారు.
జనవరిలో వస్తున్న అన్ని సినిమాలపైన అంచనాలు ఉండటం సర్వసాదారణం.
కానీ బడ్జెట్ పరంగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమాల ఆర్డర్ మాత్రం మొదట ‘గేమ్‌ఛేంజర్’, ‘డాకు మహరాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలే అని చెప్పొచ్చు.
అందుకే ఈ ఏడాది ‘సంక్రాంతి బరిలో నిలిచేదెవరో? గెలిచేదెవరో? మరో రెండువారాల్లో తేలనుంది. ఆల్ ది వెరీ బెస్ట్ టాప్ టాలీవుడ్ మూవీస్…
శివమల్లాల
Also read this : సినిమా రేంజ్ వెబ్‌సిరీస్ హరికథ కథ…
