కాలం చాలా విలువైనదని అంటారు. కొన్ని క్షణాలు పోతే తిరిగి రావు. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పదిలం. సినిమాలు.. సినీ నటులు దీనికేమీ ప్రత్యామ్నాయం కాదు. కొన్ని సినిమాలు, కొన్ని ఫోటోలు ఎప్పుడు చూసినా అభిమానుల కళ్లలో ఓ వెలుగు, పెదవులపై చిరునవ్వు కనిపిస్తుంది. అలాంటి ఫోటోనే ఇది.. బాబాయ్, అబ్బాయ్.. అదుర్స్ కదా. అవును ఈ ఫోటో ‘అదుర్స్’ సినిమా టైంలో తీసిందే. నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి తీసుకున్న ఫోటో ఇది.
దాదాపుగా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఆ ప్రేమలు.. అప్యాయతలే వేరు. నందమూరి హీరోలు ఒకరికొకరు చక్కగా సపోర్ట్ చేసుకునేవారు. ఒకరి సినిమాకు మరొకరు వచ్చి ప్రమోషన్ చేసేవారు. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడు చూస్తామా? అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కుటుంబ పరమైన విభేదాలతో ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఒకవైపు.. మిగిలిన కుటుంబమంతా ఒకవైపు అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం కలిసి పోవాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల