What is this free movement:
0కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అస్సాంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్, మయన్మార్ సరిహద్దుల మధ్య ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు. దేనితోపాటు రెండు దేశాల మధ్య ఉన్న ఫ్రీ మూమెంట్ రెజీమ్ ను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అసలు ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్(FMR) అంటే ఏమిటి? రెండు దేశాల మధ్య అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు కేంద్రం దాన్ని రద్దు చేయాలని ఎందుకు భావిస్తోంది…
ఫ్రీ మూమెంట్ రెజీమ్…
భారత్ మయన్మార్ తో 1,643 కిలోమీటర్ల సరిహద్దు రేఖ కలిగి ఉంది. సరిహద్దు రేఖకు అటు ఇటు 16 కిలోమీటర్ల దూరం ప్రజలు ఎప్పుడైనా ఎటైనా వీసా లేకుండా తిరగవచ్చు. సరిహద్దు రేఖను దాటి ఏడాది పాటు అవతలి దేశంలో ఉండవచ్చు. ఇదే ఫ్రీ మూమెంట్ రెజీమ్. 2018లో మోదీ ప్రభుత్వం దీన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తీసుకువచ్చింది. నిజానికి 2017 లోనే ఇలాంటి వెసులుబాటు ఒకటి ఉన్నప్పటికీ రోహింగ్యాల వలసల కారణంగా దాన్ని మధ్యలో నిలిపివేశారు. అయితే, 2018లో మయన్మార్ లోని ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంతో భారత్ సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇరుదేశాలు పరస్పర ఒప్పందంతో ఈ రెజీమ్ తీసుకొచ్చాయి.
ఎందుకు దీన్ని తీసుకువచ్చారు?
మయన్మార్ భారత ఉపఖండంలో ఒక భాగం. బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు 1826లో మయన్మార్ భారత్ మధ్య సరిహద్దు రేఖను గీశారు. ఈ సమయంలో స్థానిక ప్రజల సూచనలను, సలహాలను, అభిప్రాయాలను, డిమాండ్లను వారు పట్టించుకోలేదు. దీంతో ఒకే ద
తెగకు చెందిన ప్రజలను వేరువేరు దేశాలుగా విభజించినట్లు అయ్యింది. మయన్మార్ భారత్ లోని మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఈ రాష్ట్రాలకు చెందిన పలు తెగల ప్రజలు మయన్మార్ లో కూడా ఉన్నారు. వారి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుకు అటు ఇటు తరచూ రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్న సమయంలో ప్రజల వెసులుబాటు కోసం, స్థానికంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య అవసరాల కోసం దీన్ని తీసుకొచ్చారు.
అయితే సమస్య ఏంటి?
సాధారణంగానే మయన్మార్ నుంచి భారతదేశంలోకి, ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలోకి కుకీ- చిన్ తెగ ప్రజల వలసలు ఎక్కువ. దీనికి తోడు 2021లో మయన్మార్ లో సూచి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఉంటా మిలిటరీ కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది. తర్వాత కుకీ తెగ ప్రజలపై హింసకు తెగబడింది. దీంతో 40 వేల మందికి పైగా కుకీలు FMR వెసులుబాటు ఉండటంతో భారత్ లోకి చొచ్చుకు వచ్చారు. కొంతమంది సైనికులు కూడా భారత్ లో ఆశ్రయము కోరారు. గతేడాది నుంచి మణిపూర్ లో జరుగుతున్న తెగల మధ్య ఘర్షణలో మయన్మార్ నుంచి వచ్చిన కుకీల పాత్ర ఉందని మైతేయీలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా డ్రగ్స్, ఆయుధాలు సరఫరా చేస్తూ నార్కో టెర్రరిజాన్ని సృష్టిస్తూ వారు సరిహద్దుల్లో ఇబ్బందులు కలగజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కూడా ఫ్రీ మూమెంట్ రెజీమ్ ను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే మిజోరాం, నాగాలాండ్ మాత్రం మయన్మార్ లో ఉన్న తెగలతో ఉన్న సత్సంబంధాలు, వాణిజ్య అవసరాల నేపథ్యంలోఈ రెజీమ్ ని ఎత్తివేయడానికి అంత సుముఖంగా లేవు.
మణిపూర్ లో పరిస్థితి
మయన్మార్ లో మిలటరీ తిరుగుబాటు జరిగినప్పటి నుంచి మణిపూర్ లోకే వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వలసల పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది మేనమాల నుంచి వచ్చిన కుకీ తెగ ప్రజలను గుర్తించాలని, వారిని వెనక్కు పంపాలని నిర్ణయించింది. ఈ కమిటీ 2023లో 2వేల మందికి పైగా మయన్మార్ ప్రజలు మణిపూర్ లోకి వలస వచ్చినట్లు గుర్తించింది. 2022 సెప్టెంబర్ లో 5500 మందిని గుర్తించింది. వీరిలో కొంతమందిని వెనక్కి పంపించారు. మరి కొంతమంది బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నారు. మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కుకీ తెగ ప్రజలు స్థానిక కుకీల సాయంతో గ్రామాలు ఏర్పరుచుకోవడం, వాటికోసం అడవులు నరకడంతో పర్యావరణపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని మణిపూర్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గ్రామాలను, నివాసాలను తొలగించి వారిని తిరిగి వెనక్కి పంపే క్రమంలో స్థానిక కుకీలు అడ్డుపడుతుండటంతో జాతుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయన్న వాదన ఉంది.