హీరో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా చూసే పెదవులపై నవ్వుంటుందని చేసిన ప్రామిస్‌ను నేను నిలబెట్టుకున్నా. మీరు కూడా సినిమా చూస్తామని ప్రామిస్ చేసి నిలబెట్టుకున్నంతుకు థ్యాంక్యూ. ఆడియన్స్ థియేటర్స్‌లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది’’ అన్నాడు.
డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుతుంటే అసలైన కిక్ వచ్చింది. ఈ సినిమా ఏడాదిన్నర పాటు కష్టానికి ఫలితం నిన్న చూసుకున్నాం’’ అన్నారు. డైరెక్టర్ నితిన్ మాట్లాడుతూ.. ‘‘మా కంఫర్ట్ జోన్ ని వదులుకొని చేసిన ప్రయత్నానికి మీరు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నామని చెప్పారు’’ అని పేర్కొన్నారు. హీరోయిన్ దీపికా మాట్లాడుతూ… ‘‘మా సినిమాకి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది’’ అని తెలిపింది.