న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు.
కాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వీణా రావు ఏవి ని చూపించారు వైవీఎస్ చౌదరి.
ప్రముఖ నిర్మాతలు స్వప్న దత్ మరియు సుప్రియ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిలుగా వచ్చారు. వారి చేతుల మీదుగా వీణా రావు ఏవి ని లాంచ్ చేసారు…
అనంతరం వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ : నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్ గా వెలిగారు.
అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా.
ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం” అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు.
దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ
వైవీఎస్ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. మరో కొన్నీ రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
సంజు పిల్లలమర్రి