ఒక్కరోజులో12 లక్షల లాభం వస్తే…18 లక్షల నష్టం వచ్చింది– వివాహ భోజనంబు మేనేజింగ్‌ పార్టనర్‌ రవిరాజు

ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకునేవారు శుభకార్యంతో తమ పని మొదలెడతారు. క్యాటరింగ్‌ చేస్తాం అని బోర్డ్‌ పెట్టి ఆరు నెలలైనా ఒక్క ఈవెంట్‌ రాలేదు వీళ్లకి. అప్పుడొచ్చిన తొలి ఈవెంట్‌ ఒక దినానికి క్యాటరింగ్‌ చేయాలని. ఆ ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తి మీరు ప్రారంభించిన ఈ క్యాటరింగ్‌ దినంతో మొదలు పెట్టాలా? అనే సందేహం ఉంటే చేయొద్దు. నేను ఎవరితో ఒకరితో చేయించుకుంటాను అన్నారు ఆ ఈవెంట్‌ అప్పచెప్పిన డాక్టర్‌గారు. మాకు అన్నం పెట్టే ఈవెంట్‌ ఏదైనా మాకు శుభకార్యమే అంటూ వారు తమ క్యాటరింగ్‌ని ప్రారంభించారు. ఆ దినంతో మొదలైన వారి వ్యాపారం ఈ రోజు ‘వివాహ భోజనంబు’ వంటి పెద్ద రెస్టారెంట్‌లా మారి హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో ఒన్‌ ఆఫ్‌ ది ఫైన్‌ రెస్టారెంట్‌లా పేరు తెచ్చుకుంది.
‘వివాహ భోజనంబు’ హోటల్‌ అనగానే మనకు హీరో సందీప్‌ కిషన్‌ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆ హోటల్‌ను తాను అంతగా ఓన్‌ చేసుకుని ప్రమోట్‌ చేశారు. వివాహ భోజనంబు మేనేజింగ్‌ ప్రొప్రైటర్‌ రవిరాజుతో ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌ బిజినెస్‌ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వూ చేసింది. ఈ పాడ్‌కాస్ట్‌లో రవిరాజు చెప్పిన విషయాలు హోటల్‌ బిజినెస్‌లో ఉన్న ప్లస్‌లు, మైనస్‌లతోపాటు ఒకరోజు 12 లక్షల లాభం వస్తే మరో రోజు 18 లక్షల నష్టం ఎందుకొచ్చింది? ఇలాంటి అనేక విషయాలను చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. మీరు ఓ లుక్కేయండి…ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This :ఉగాది సంధర్భంగా పూణే లో సాయి కుమార్ కి అవార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *