‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న జీ5లో ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి’’ అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘టీం అంతా కలిసి మంచి సక్సెస్ ఇవ్వబోతోన్నారు. అను గారు నా మీద నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. రెక్కీ తరువాత పదిహేను కథలు విన్నాను. కానీ ఏ సబ్జెక్ట్ కూడా నచ్చలేదు. కానీ దివ్య గారి ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ కథ జీ5 వద్దకు వచ్చింది. అను మేడం గారు నన్ను రిఫర్ చేశారు. దివ్య గారు చెప్పిన నెరేషన్ విన్న తరువాత ఆ కథ నన్ను చాలా వెంటాడింది. అభిజ్ఞ సైతం ఈ కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణ గారు కూడా ముందు ఈ ప్రాజెక్ట్‌లో లేరు. కానీ నా మాట కోసం కృష్ణ గారు వచ్చి డైరెక్షన్ చేశారు’’ అన్నారు. డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘నేను జీ5లో ఇది వరకు ‘రెక్కీ’ చేశాను. అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ చేశాను. రెక్కీలానే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అని అన్నారు.
హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ .. ‘‘మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఈ కథను నాకు శ్రీరామ్ గారు చెప్పారు. అద్భుతమైన కథ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పని చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. చరణ్ లక్కరాజు మాట్లాడుతూ .. ‘‘క్యాస్టింగ్ మేనేజర్ సతీష్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారికి థాంక్స్. కృష్ణ గారి లాంటి దర్శకుడితో పని చేయడం నా అదృష్ణం. ఆయనకు ప్రతీ సీన్‌పై ఎంతో క్లారిటీ ఉంటుంది. కృష్ణ గారు, మహేష్ గారు చాలా వేగంగా పని చేస్తుంటారు. అభిజ్ఞ గారితో పని చేయడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల