మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు.
అందులో చిన్న పిల్లల సీన్ హైలైట్. అందులో రేయ్ సత్తి.. బాలు అటు వచ్చిందా.. ? అని ఒక పిల్లవాడు అడుగుతాడు.. గుర్తుందా.
ఆ పిల్లవాడే రవి రాథోడ్. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టులు.. హీరోలుగా, హీరోయిన్లుగా మారుతున్నారు.
చాలామందికి ఈ పిల్లవాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తాడేమో అనుకున్నారు కానీ, అందరి జీవితాలు ఒకేలా ఉండవు. రవి కథ కూడా అలాంటిందే.
హీరోగా మారాల్సిన కుర్రాడు.. రోడ్ల మీద తాగి తిరుగుతున్నాడు. అసలు ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించి షాక్ ఇచ్చాడు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ రవి రాథోడ్ ను గుర్తుపట్టి అతనిని ప్రశ్నలు అడిగి సోషల్ మీడియాలో పెట్టడంతో అతని గురించి బయటపడింది.
రవి రాథోడ్ సొంత వూరు మిర్యాలగూడ. అతని బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. అలా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న కుటుంబంలోనే జన్మించాడు రవి.
ఇక అతనికి మూడు నెలల వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రాజశేఖర్, సౌందర్య నటించిన మా ఆయన బంగారం సినిమాలో వారి కొడుకుగా కనిపించాడు.
ఆ సినిమా తరువాత ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఆంధ్రావాలా, ఖడ్గం, మాస్ , జెమిని, విక్రమార్కుడు, డాన్, కేడీ, బొమ్మరిల్లు.
ఇలా మొత్తం 52 సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. అంత మంచి బాలనటుడు జీవితంలో పెద్ద విషాదం జరిగింది.
రవిరాథోడ్ తన జీవితంలో జరిగిన విషాదం గురించి, తాను తాగుబోతు ఎలా అయ్యాడో తెలిపాడు.
”అమ్మానాన్న, బామ్మ ముగ్గురు కాల్చుకొని చనిపోయారు. ఏమైందో నాకు తెలియదు ఏదో గొడవ జరిగింది.
అప్పుడు నేను SMS సినిమా చేస్తున్నాను. 16 ఏళ్ల వయస్సులో అదే నా లాస్ట్ సినిమా.
అప్పటినుంచి ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. అది జరిగాకా నాకేం అర్ధం కాలేదు.
ఏం చేయాలో తెలియక నా ఫ్రెండ్స్ ను అడిగితే నువ్వు మర్చిపోవాలంటే ఒకటే మార్గం.
అప్పుడే తాగుడుకు బానిస అయ్యాను. మా అమ్మ చివరగా నాకు ఒకటే మాట చెప్పింది.
ఒంటరిగా ఉండకు.. ఎవరినైనా తోడు తీసుకో అని చెప్పింది. నాకు ఆ తోడునే అశోక్ అన్న. ఆయన వలనే నేను ఇక్కడ ఉన్నాను.
ఇప్పుడు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ లు వారికి సపోర్ట్ ఉంది. నాకు లేదు. మా నాన్న సారా అమ్మేవాడు.
వాళ్లముగ్గురు కాల్చుకొని చనిపోతే వాళ్ల శవాలను చూసి అప్పుడు నేను ముందుకు అలవాటు పడ్డాను.
ప్రస్తుతం నేను సెట్ వర్క్ లో పని చేస్తున్నాను. రోజుకు రూ. 700 ఇస్తారు. దాంతోనే తాగుతాను.
మా అశోక్ అన్న తీసిన వీడియో వలన నన్ను చాలామంది గుర్తుపట్టారు.
ఇప్పుడు నా లైఫ్ లో నాకేమి వద్దు. నా వరకు నేను చెప్పుకోవడానికి చాలా ఉంది.
ఎవరైనా అవకాశం కోసం వస్తే మాత్రం ఛాన్స్ ఇవ్వండి” అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రవి రాథోడ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అతని లైఫ్ స్టోరీ విన్నవారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
సంజు పిల్లలమర్రి
Also read this : అవార్డులకు ఓకే..రివార్డులకు నాట్ ఓకే…
