Vijayawada : విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Vijayawada :

విజయవాడలో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి కలకలంరేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న వైద్యుడు డి.శ్రీనివాస్‌ ఇంటి బయట ఉరివేసుకున్నాడు.

ఇంటి లోపల ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కన్పించాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ ఆర్థోపెడిక్ డాక్టర్‌గా ఉన్నారు.. విజయవాడలో శ్రీజ ఆస్పత్రిని నడుపుతున్నారు.

హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే.. ఇంటి బయట ప్రాంగణంలో చెట్టుకు డాక్టర్ శ్రీనివాస్ ఉరి వేసుకున్నారు.

ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయటంతో మృతి చెందినట్లు గుర్తించారు. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక అందరినీ హత్య చేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్ కుటుంబం ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Also Read This Article : తెలంగాణలో పదో తరగతిలో బాలికలదే పైచేయి

Dr. Chiranjeevi Gaaru Exclusive Interview
Dr. Chiranjeevi Gaaru Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *