టాలీవుడ్‌లో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆసక్తికర చిత్రం VD12,
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రానికి సాయి సౌజన్య, గిరీష్ దశిక సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ శక్తివంతమైన టీజర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గీరీశ్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి, కళా విభాగం పనులను కోలా అవినాశ్ నిర్వహిస్తున్నారు.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకులను విభిన్న అనుభూతికి లోనుచేయనుంది.
ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు దర్శకనిర్మాతలు మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది.
“అలసట లేని భీకర యుద్ధం… వలసపోయిన, అలసిపోయిన ఓ రాజ్యపు కథ… ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిలో పుట్టే కొత్త రాజు కోసం…”
అంటూ ఎన్టీఆర్ శక్తివంతమైన డైలాగ్స్ చెబుతుండగా, విజువల్స్ గ్రాండ్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కనిపించాయి.
జైలులో కూర్చొని విజయ్ దేవరకొండ చేసిన ఆర్తనాదాలు, ఆగ్రహభరితంగా “ఏమైనా చేస్తా సార్… అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా” అని చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.
‘కింగ్‌డమ్’ సినిమాను మే 30, 2025న భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వెండితెరపై విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎలా ఉంటుందో చూడాల్సిందే..
సంజు పిల్లలమర్రి
Also Read This : ఆ రెండురోజులు ఏడుస్తూనే ఉన్నా– విష్వక్‌సేన్