The Family Star :
సినిమా…సినిమా..సినిమా..మనం ఏ రంగంలో ఉన్నా మన లైఫ్‌లన్నీ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయ్. అందుకే మనకి సినిమా నచ్చితే, కొంచెమైనా బావుందనిపిస్తే ఆ సినిమాని ఆకాశానికి ఎత్తుకుంటున్నాం.
పొరపాటున సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసిందా? ఇంక అంతే? ఆ సినిమా తీసిన వాళ్లంతా మన శత్రువులు అన్నట్లు ఫీలవుతున్నాం. వాళ్లని శత్రువులకంటే హీనంగా ఘోరంగా చూస్తున్నాం.
ఈ విషయంలో తప్పెవరిది. సినిమాను కోట్ల రూపాయల వ్యయంతో తీస్తున్న సినిమా వారిదా? మూడుగంటల టైమ్‌తో పాటు డబ్బు పెట్టి సినిమాను చూస్తున్న సగటు ప్రేక్షకునిదా? నిజంగా మాట్లాడితే ఈ ఇద్దరిది కాదు.
ఈ ఇద్దరికి మధ్యలో లాలూచి పడే సినిమాని చంపేసే మరో వర్గం ఒకటి తయారయ్యింది. ఆ వర్గం సోషల్ మీడియా అనే పేరు పెట్టుకుంది. చేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతివాడు ఎవరినైనా, ఎలాగైనా తిట్టొచ్చు.
అన రాని మాటలనొచ్చు. ముఖ్యంగా కొంతమంది హీరోలను, నిర్మాతలను, దర్శకులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా నానా యాగీ చేస్తూ దుర్భాషలాడటం ఫ్యాషనై పోయింది. ఈ వర్గానికి ఈ వారం బలైన హీరో విజయ్ దేవరకొండ.
‘ఫ్యామిలీస్టార్’ అంటూ ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మొదటి షో పూర్తి కాకుండానే సినిమా ఫ్లాప్ అయ్యింది, డిజాస్టర్ అని రకారకాలుగా టాక్‌ను స్ప్రెడ్ చేశారు.
వీళ్లంతా ఎవరు? ఎక్కడనుండి ఈ టాక్‌ను మార్కెట్‌లోకి వదులుతున్నారు? అనే విషయాన్ని తేలాల్సిందే అని హీరో విజయ్, నిర్మాత రాజు పోలీసులను ఆశ్రయించారు. నిజంగా మాట్లాడితే బాగాలేని సినిమాని ఎవరు కాపాడలేరు.
కానీ, ఓవర్‌గా నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం వల్ల అయ్య బాబోయ్ సినిమా ఎంత ఘోరంగా ఉందో అంటూ బెంబేలెత్తిపోయి సినిమా థియేటర్ వైపుకు రావటానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడరు.
దానివల్ల కొద్దోగొప్ప బాగున్న సినిమాని కూడా చూడటానికి ఇష్టపడరు. సినిమావాళ్లెవరు మనకు శత్రువులు కాదు.
ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించటానికి సినిమా కష్టాలను అనుభవిస్తూ, మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించటం మాత్రమే తెలిసినవాళ్లు.
ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చాలా సినిమాలు ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. దానికి కారణాలేమైనా కానీ నష్టపోయేది నిర్మాత, దర్శకుడు, నటీనటులే కాదు. సినిమాతో ఎంతో ఇష్టంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అనుభవించే అసలు సిసలు సినిమా ప్రేక్షకుడు కూడా. డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ….ట్యాగ్ తెలుగులో ఈ సరికొత్త కథనాన్ని చూడండి. కథనాన్ని అందిస్తుంది శివమల్లాల
Also Read This Article : పుట్టడమే స్టార్ గా పుట్టినా, సరైన హిట్టు లేని హీరో