రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ డిఫరెంట్‌గా విజయ్ నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో కలిసి పికిల్ బాల్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఓ సవాల్ విసిరారు. ఈ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబయి ఇండియన్స్ జెర్సీ వేసుకుంటానని తిలక్ వర్మకు ఛాలెంజ్ చేశాడు. ఈ పికిల్ బాల్ మ్యాచ్‌లో 2-1తో విజయ్ టీమ్ గెలుపొందడంతో ముంబై ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై పెద్ద ఎత్తున నెటిజన్స్, సెలబ్రిటీలు స్పందింస్తున్నారు. విజయ్ కూడా తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’లోని ’హృదయం లోపల’ సాంగ్‌కు రీల్ చేయాలని తిలక్ వర్మ, రాజంగడ్‌ను కోరాడు. వాళ్లు రీల్ చేస్తే.. హైదరాబాద్‌లో జరిగే ప్లేఆఫ్స్‌కు వస్తానని, ముంబయి టీమ్‌ను సపోర్ట్ చేస్తానని తెలిపాడు. ఈ రోజు (మంగళవారం) వాంఖేడే స్డేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరుకు రెడీ అవుతోంది. ఇక కింగ్‌డమ్ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ప్రజావాణి చీదిరాల