ఏంటో ఈ ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ వస్తుంది.. అభిమానులు ఆనందించే లోపు తూచ్ అంటుంది. తేదీలైతే మారుతున్నాయి కానీ విడుదల మాత్రం కావడం లేదు. జూన్ 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ డేట్ ఫిక్స్ అని.. ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. తాజాగా చావు కబురు చల్లగా చెప్పినట్టు మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరో డేటు కూడా ప్రకటించలేదు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
అయితే తాజాగా మరో అప్‌డేట్ అయితే ప్రచారంలో ఉంది. అదేంటంటే.. మూవీ విడుదల తేదీని ట్రైలర్‌తో పాటు ప్రకటిస్తారట. ట్రైలర్ కూడా త్వరలోనే వస్తుందని సమాచారం. కష్టమైనా విడుదల తేదీని వాయిదా వేస్తున్నామని.. ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను క్రిష్ జాగర్లూమూడి, జ్యోతికృష్ణ రూపొందించారు. ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.