...

తెలుగులో విడుదలకు ‘వీర చంద్రహాస్’ రెడీ.. వెండితెరపై తొలిసారిగా..

‘కేజీయఫ్, సలార్’ వంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. ‘వీర చంద్రహాస్’ అనే కన్నడ చిత్రాన్ని ఆయన రూపొందించారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా.. శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌పై ఎన్ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో ఈ సినిమా విడుదలైంది. మంచి సక్సెస్ టాక్‌ను తెచ్చుకోవడంతో మేకర్స్ తెలుగులోనూ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘రీసెంట్‌గా కన్నడలో విడుదలైన ‘వీర చంద్రహాస’ చిత్రం మంచి హిట్ టాక్‌తో వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి సక్సెస్ చేస్తారు’’ అని అన్నారు. మహాభారతంలోని అశ్వమేదిక పర్వంలోని ఒక కథను తీసుకుని రవి బస్రూర్ సినిమాగా రూపొందించారు. అనాథ పిల్లవాడైన వీర చంద్రహాస్ గొప్ప పరాక్రమవంతుడే కాకుండా సద్గుణవంతుడు కూడా. అలాగే యక్షగానం అనేది ఇప్పటి వరకూ వెండితెరపై వెలిగింది లేదు. తొలిసారిగా పూర్తి వైభవంతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.