ఎన్టీఆర్‌తో సినిమా.. కథలో త్రివిక్రమ్ మార్పులు చేశారట..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ అయితే ఫిక్స్. వాస్తవానికి ఈ సినిమా అల్లు అర్జున్‌తో చేయాల్సి ఉంది. ఎందుకో బన్నీ సైడ్ అయిపోయి సీన్‌లోకి ఎన్టీఆర్ వచ్చాడు. అయితే ఎన్టీఆర్‌ బాడీ ల్యాంగ్వేజ్‌కు అనుగుణంగా త్రివిక్రమ్.. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గాడ్‌ పాత్రలో నా మోస్ట్‌ ఫేవరెట్‌ అన్న నటించనున్నారు. గాడ్‌ ఆఫ్‌ వార్‌ ఈజ్‌ కమింగ్‌’ అంటూ నాగవంశీ ట్వీట్ చేసి సోషల్ మీడియాను హోరెత్తించారు. దీంతో ఎన్టీఆర్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటారని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు.

అంతేనా ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారనే న్యూస్‌తో వెంటనే ఏఐలో సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మైథలాజికల్‌ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుందట. మొత్తానికి ఒకే ఒక్క ట్వీట్‌తో నాగవంశీ అయితే సినిమా ప్రారంభానికి ముందే హాట్ టాపిక్‌గా మార్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’; ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమాను చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2’ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *