క్రికెట్లో స్లెడ్జింగ్ అనే మాటను తరచు వింటుంటాం. మరి చిత్ర పరిశ్రమలో స్లెడ్జింగ్ ఏంటి? అనుకుంటున్నారా.
మీరు విన్నది నిజమే సినిమా ఇండస్ట్రీలో కూడా స్లెడ్జింగ్ ఉంది అని రుజువుచేశారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.
బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రం ‘డాకు మహరాజ్’.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో బాగంగా
వంశీ మీడియాతో మాట్లాడుతూ : ‘‘ చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పరవాలేదు..బాలయ్య బాబు ఫ్యాన్‌గా మాట్లాడుతున్నాను.
బాబి చిరంజీవిగారితో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కంటే బాలయ్యతో తీసిన ‘డాకు మహరాజ ’ ను అద్భుతంగా తీశాడు అని తన సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి
అవసరం లేకుండానే చిరంజీవి సినిమాను స్లెడ్జింగ్ చేస్తూ మెగాఫ్యాన్స్‌ను ఒక గిల్లు గిల్లాడు.
దానికి కారణం చాలా సింపుల్. ఏ కాంట్రవర్సీ లేకపోతే మీడియా అటెన్షన్ పెద్దగా ఉండదు.
అందుకోసమే నాగవంశీ తనదైన స్టైల్లో ‘డాక్ మహరాజ్’ సినిమాను ప్రమోట్ చేసుకోవటానికి మాత్రమే మాటలను వదులుతుంటాడు.
అది అతని స్ట్రాటజీ. రెగ్యులర్‌గా సినిమా ప్రమోషన్లలో ఏదోరకంగా స్లెడ్జింగ్ చేసి తన సినిమాలను బతికించుకునే ప్రయత్నంలో ఉంటాడు.
2025లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి దాదాపు 7 సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంటరటైన్ చేయనున్నాయి.
బాలయ్యతో పాటు రవితేజ, విజయ్‌దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, మ్యాడ్ స్వే్కర్ చిత్రాలను అందించనున్నారు సితార నాగవంశీ…
శివమల్లాల
Also read this : గేమ్‌చేంజర్ ఈవెంట్‌కి పవర్‌స్టార్ ఫిక్స్….