Godari Gattupaina : రెడ్ పప్పెట్ ఫస్ట్ వెంచర్‌‌కు టైటిల్ ఫిక్స్

Godari Gattupaina

‘మేము ఫేమస్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ ప్రభాస్ హీరోగా ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ రూపొందనుంది. రెడ్ పప్పెట్ ఫస్ట్ వెంచర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం కానున్నారు. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో ఆయన పాపులర్ అయ్యారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘గోదారి గట్టుపైన’ అనే పాటను విడుదల చేశారు. దీంతో పాటు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. టైటిల్ లోగో విజువల్ అయితే చాలా బాగుంది. ప్రశాంతమైన గోదావరి ప్రాంతాన్ని అందంగా ప్రెజెంట్ చేశారు. టైటిల్, పోస్టర్ రెండింటి డిజైన్ ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌పై చిత్ర దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ఒక చల్లని సాయంకాలం వేళ ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కూర్చొంటే ఎంత హాయిగా ఉంటుందో తమ సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా రిలాక్స్‌గా ఉండటమే కాకుండా అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటుందని.. ఈ చిత్రాన్ని గోదావరి జిల్లాల్లో ఈ సినిమాను చిత్రీకరించినందువల్ల సినిమాకు ‘గోదారి గట్టుపైన’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను సినిమాలో చూపించడం జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : గద్దర్‌లా ఎగురుతున్న రవి వరుఫ్‌ ఆంటోని..

Ravi Antony Exclusive Interview
Ravi Antony Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *